Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ " సురేందర్ రెడ్డి కాంబినేషన్

గతంలో మెగా కాంపౌండ్ లో రేసుగుర్రం లాంటి హిట్ సినిమా చేశాడు సురేందర్ రెడ్డి. అప్పుడే రామ్ చరణ్, సురేందర్ రెడ్డికి మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం సురేందర్ రెడ్డికి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాడు చెర్రీ. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. తమిళంలో హిట్టయిన తని ఒరువన్ సినిమా రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్. ఈ సినిమా రీమేక్ బాధ్యతల్నే సురేందర్ రెడ్డికి అప్పగించే అవకాశముంది. ప్రస్తుతం చరణ్ తో […]

రామ్ చరణ్  సురేందర్ రెడ్డి కాంబినేషన్
X
గతంలో మెగా కాంపౌండ్ లో రేసుగుర్రం లాంటి హిట్ సినిమా చేశాడు సురేందర్ రెడ్డి. అప్పుడే రామ్ చరణ్, సురేందర్ రెడ్డికి మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం సురేందర్ రెడ్డికి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాడు చెర్రీ. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. తమిళంలో హిట్టయిన తని ఒరువన్ సినిమా రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్. ఈ సినిమా రీమేక్ బాధ్యతల్నే సురేందర్ రెడ్డికి అప్పగించే అవకాశముంది. ప్రస్తుతం చరణ్ తో బ్రూస్ లీ సినిమా నిర్మిస్తున్న దానయ్యే ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తాడు. నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి చాలామంది క్యూలో ఉన్నారు. మొదట ఈ సినిమా రీమేక్ బాధ్యతల్ని హరీష్ శంకర్ లేదా గోపీచంద్ మలినేనిలో ఒకరికి ఇద్దాముకున్నారు. ఎందుకంటే.. గబ్బర్ సింగ్ ను రీమేక్ గా తీసిన అనుభవం హరీశ్ శంకర్ కు.. బాడీగార్డ్ ను రీమేక్ గా తెరకెక్కించిన అనుభవం గోపీచంద్ మలినేనికి ఉన్నాయి. కానీ ఈ ఇద్దర్నీ కాదని సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు చెర్రీ.
Next Story