Telugu Global
Cinema & Entertainment

మహేష్ మిస్సయ్యే అవకాశాలే ఎక్కువ..

శ్రీమంతుడు సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఏకంగా 185 సెంటర్లలో ఈ సినిమా దిగ్విజయంగా ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇంతటి అఖండ విజయానికి ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఓ కారణం. అందుకే ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్ ను అమెరికాలో ప్లాన్ చేశారు నిర్మాతలు. ఈ కార్యక్రమానికి మహేష్ కూడా వస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ మహేష్ ఓవర్సీస్ లో జరిగే కార్యక్రమానికి హాజరుకావడం లేదు. శ్రీమంతుడు సినిమా వేడుకను అమెరికాలో ఏర్పాటుచేసినప్పటికీ.. […]

మహేష్ మిస్సయ్యే అవకాశాలే ఎక్కువ..
X
శ్రీమంతుడు సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఏకంగా 185 సెంటర్లలో ఈ సినిమా దిగ్విజయంగా ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇంతటి అఖండ విజయానికి ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఓ కారణం. అందుకే ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్ ను అమెరికాలో ప్లాన్ చేశారు నిర్మాతలు. ఈ కార్యక్రమానికి మహేష్ కూడా వస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ మహేష్ ఓవర్సీస్ లో జరిగే కార్యక్రమానికి హాజరుకావడం లేదు. శ్రీమంతుడు సినిమా వేడుకను అమెరికాలో ఏర్పాటుచేసినప్పటికీ.. మహేష్ వచ్చే అవకాశాలు తక్కువే. ఎందుకంటే.. ప్రస్తుతం సూపర్ స్టార్ బ్రహ్మోత్సవం సినిమాలో బిజీగా ఉన్నాడు. వరుసగా నెల రోజుల పాటు ఈ సినిమాకే కాల్షీట్లు కేటాయించాడు ప్రిన్స్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఫిలింసిటీలో ఏకథాటిగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇలాంటి టైమ్ లో అమెరికాకు వెళ్లడం మహేష్ కు వీలుకాకపోవచ్చు. నిర్మాత-దర్శకుడు ఒప్పుకోవడంతో పాటు హీరోయిన్ల కాల్షీట్లు కూడా ఎడ్జెస్ట్ అయినప్పుడు మాత్రమే మహేష్ అమెరికాకు వెళ్లగలడు. లేదంటే కష్టమే.
First Published:  25 Sep 2015 7:00 PM GMT
Next Story