Telugu Global
Others

చో రామస్వామి ఆరోగ్యస్థితి విషమం

వ్యంగ్య రచయితగా, నటుడిగా, తుగ్లక్‌ పత్రిక ఎడిటర్‌గా, నాటక రచయితగా మంచి పేరున్న జర్నలిస్టు చోరామస్వామి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుండడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. తన రచనల ద్వారా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన ఆయనను కొంతకాలం క్రితం ప్రధాని నరేంద్రమోడి ఇంటికెళ్ళి పరామర్శించారు. ఆయన పాత్రికేయుడుగాను, రాజకీయ వ్యంగ్య రచయితగాను సుప్రసిద్ధుడు. ఆయన తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా తమిళనాడుకే కాకుండా ఇతర రాష్ట్రాలకు […]

వ్యంగ్య రచయితగా, నటుడిగా, తుగ్లక్‌ పత్రిక ఎడిటర్‌గా, నాటక రచయితగా మంచి పేరున్న జర్నలిస్టు చోరామస్వామి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుండడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. తన రచనల ద్వారా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన ఆయనను కొంతకాలం క్రితం ప్రధాని నరేంద్రమోడి ఇంటికెళ్ళి పరామర్శించారు. ఆయన పాత్రికేయుడుగాను, రాజకీయ వ్యంగ్య రచయితగాను సుప్రసిద్ధుడు. ఆయన తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా తమిళనాడుకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా తెలిసిన వ్యక్తి.
First Published:  25 Sep 2015 1:05 PM GMT
Next Story