Telugu Global
Cinema & Entertainment

త‌మ‌న్నా అద‌ర హో...!

రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో సంపత్‌ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘బెంగాల్‌ టైగర్‌’. ఈ సినిమా సరికొత్త పోస్టర్లను చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. అందులో భాగంగా తమన్నా ఫస్ట్ లుక్ ఫొటోని వదిలింది. ఈ ఫొటో చూసిన వారు ఇంత హాట్ గానా అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  న్యూ లుక్ లో  […]

త‌మ‌న్నా అద‌ర హో...!
X

రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో సంపత్‌ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘బెంగాల్‌ టైగర్‌’. ఈ సినిమా సరికొత్త పోస్టర్లను చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. అందులో భాగంగా తమన్నా ఫస్ట్ లుక్ ఫొటోని వదిలింది. ఈ ఫొటో చూసిన వారు ఇంత హాట్ గానా అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. న్యూ లుక్ లో త‌మ‌న్నా హాట్ హాట్ గా ఎట్రాక్ట్ చేస్తుంది.

ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు. సంప‌త్ నంది రెండ‌వ సినిమా ర‌చ్చ‌లో కూడా త‌మ‌న్న‌నే హీరోయిన్ కావ‌డం విశేషం. ఏమైంది ఈ వేళ‌తో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండ‌వ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశాడు. ర‌చ్చ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌2 కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది.కానీ ప‌వ‌న్ కు క‌థ న‌చ్చ‌క పోవ‌డంతో.. సంప‌ద్ నందీ కి డైరెక్ష‌న్ కు నో చెప్పారు. దీంతో సంప‌త్ ఆల‌స్యం చేయ‌కుండ‌..ఆ ప్రాజెక్ట్ ర‌వితేజ తో ప్రారంభించేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెంజ్ కు క‌థ స‌రిపోక పోవ‌చ్చు కానీ.. ఇది ర‌వితేజ్ రేంజ్ కు బాగా స‌రిపోతుంది అంటున్నారు చిత్ర యూనిట్.

Next Story