Telugu Global
CRIME

జమ్మూకాశ్మీర్‌లో పాక్ జెండాల రెపరెపలు

ఈద్ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లో వేర్పాటు వాదులు మరోసారి రెచ్చిపోయి పాకిస్థాన్ జెండాలను ఎగురవేశారు. శ్రీనగర్‌లోని ప్రసిద్ధ ఈద్గా ప్రాంతంలో ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. వీరిలో వేర్పాటు వాదులు కూడా కలిసిపోయారు. ప్రార్థనలు ప్రారంభమవటానికి ముందే వేర్పాటు వాదులు పాకిస్థాన్, ఐసిస్ జెండాలు ఎగురవేసి భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రక్షణ విధుల్లో ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు.

Next Story