Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి బ‌రిలో  విశ్వ‌రూపం 2..!

విశ్వ‌రూపం మొద‌టి భాగం వ‌చ్చి  దాదాపు మూడు సంవ‌త్స‌రాలు పూర్తి కావోస్తుంది.  ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది.  ద‌ర్శ‌కుడిగా  కూడా క‌మ‌ల్  ఇంట‌ర్నేష‌నల్   టెక్నిషియ‌న్ అనిపించుకున్నాడు.  అయితే ఈసినిమా రిలీజ్ కావడానికి రాజ‌కీయంగా చాలా స‌మ‌స్య‌లు త‌మిళ‌నాట ఎదుర్కొంది. ఎట్ట‌కేల‌కు దేశ‌వ్యాప్తంగా క‌మ‌ల్ హాస‌న్ కు మీడియా  స‌పోర్ట్  చేయడంతో.. జ‌య‌ల‌లిత  వెన‌క్కు త‌గ్గి విశ్వ‌రూపం సినిమా త‌మిళ‌నాట రిలీజ్ కు  అంగీక‌రించారు.  అంత విజ‌యవంతం అయ్యింది. అయితే విశ్వ‌రూపం 2  సినిమా షూటింగ్ కూడా […]

సంక్రాంతి బ‌రిలో  విశ్వ‌రూపం 2..!
X

విశ్వ‌రూపం మొద‌టి భాగం వ‌చ్చి దాదాపు మూడు సంవ‌త్స‌రాలు పూర్తి కావోస్తుంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ద‌ర్శ‌కుడిగా కూడా క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌నల్ టెక్నిషియ‌న్ అనిపించుకున్నాడు. అయితే ఈసినిమా రిలీజ్ కావడానికి రాజ‌కీయంగా చాలా స‌మ‌స్య‌లు త‌మిళ‌నాట ఎదుర్కొంది. ఎట్ట‌కేల‌కు దేశ‌వ్యాప్తంగా క‌మ‌ల్ హాస‌న్ కు మీడియా స‌పోర్ట్ చేయడంతో.. జ‌య‌ల‌లిత వెన‌క్కు త‌గ్గి విశ్వ‌రూపం సినిమా త‌మిళ‌నాట రిలీజ్ కు అంగీక‌రించారు. అంత విజ‌యవంతం అయ్యింది.
అయితే విశ్వ‌రూపం 2 సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. రిలీజ్ గ‌త యేడాది అవుతుందిన భావించారు. కానీ ఇప్ప‌టికి చప్పుడు లేదు. అయితే క‌మ‌ల్ హాస‌న్ ఫైనాన్షియ‌ల్ ట్ర‌బుల్స్ వుండి సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిలే అవుతుందేమో అనుకున్నారు.అది కూడా కాద‌ట‌. ఈ చిత్రం ప్రొడ్యూస‌ర్ అస్కార్ రవించంద్ర‌న్ ద‌గ్గ‌ర ఉంద‌ట‌. ఆయ‌న శంక‌ర్ తో నిర్మించిన ఐ సినిమా ఘ‌రోంగా దెబ్బ‌తిన్న‌ది. దీంతో.. ఈ చిత్రం రిలీజ్ డిలే అవుతుందంటున్నారు క‌మ‌ల్ హాస‌న్. అసలు విశ్వ‌రూపం 2 ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేయ‌క పోవ‌డానికి కార‌ణాలేంటో త‌న‌కు తెలియ‌దంటున్నారు క‌మ‌ల్ హాస‌న్. మొత్తానికి అనుకున్నట్టు జరిగితే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూజాకుమార్‌, ఆండ్రియా, రాహుల్‌ బోస్‌, శేఖర్‌కపూర్‌, ఆనంద్‌ మహదేవన్‌ తదితరులు నటించారు. జిబ్రాన్‌ సంగీతం సమకూర్చారు. కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆయన అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు.

Next Story