Telugu Global
Cinema & Entertainment

నితిన్, త్రివిక్ర‌మ్  కొబ్బ‌రికాయ కొట్టారు..! 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో నితిన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అ…ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. నితిన్, త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ, సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్ (మళయాల చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ […]

నితిన్, త్రివిక్ర‌మ్  కొబ్బ‌రికాయ కొట్టారు..! 
X
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో నితిన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అ…ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. నితిన్, త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ, సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్ (మళయాల చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 5 నుండి మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
సాధార‌ణంగా మెగా హీరోల‌తో చిత్రాలు చేస్తున్న త్రివిక్ర‌మ్.. ప్ర‌స్తుతం నితిన్ వంటి ఒక మీడియ‌మ్ స్టార్ తో చిత్రం చేస్తున్నాడు. త‌న మార్క్ ఫ్యామిలీ క‌థ గా ఈ చిత్రం ఉంటుంద‌ని టైటిల్ ను బ‌ట్టి కొంత వ‌ర‌కు గెస్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య వ‌చ్చిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌రువాత‌.. త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబు వంటి సూప‌ర్ స్టార్ తో చేస్తాడ‌ని అనుకున్నారు. కానీ.. మ‌హేష్ డేట్స్ అల్రేడి బ్ర‌హ్మోత్స‌వానికి ఇచ్చేయ‌డంతో.. త్రివిక్ర‌మ్ నితిన్ తో స‌ర్ధుకు పోతున్నార‌నేది ప‌రిశీల‌కులు టాక్. ఏదైతేనేమి మొట్ట మొద‌టి సారి..నితిన్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో చిత్రం సిద్దం అవుతుంది. ఏ విధ‌మైన వంట‌కం చేసి ఆడియ‌న్స్ కు వ‌డ్డిస్తారో వేచిచూద్దాం. సంక్రాంతి త‌రువాత అ…ఆ చిత్రం రిలీజ్ వుండోచ్చ‌నేది నితిన్ స‌న్నిహితులు స‌మాచారం.
First Published:  23 Sep 2015 7:10 PM GMT
Next Story