Telugu Global
Cinema & Entertainment

సాయిధర్మతేజ సుప్రీమ్ మొదలైంది

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సుప్రీం హీరో అనే పేరు ఉండేది. ఆ పేరునే టైటిల్ గా మార్చేస్తూ ఇప్పుడు ఓ సినిమా రాబోతోంది.మెగా కాంపౌండ్ కు చెందిన సాయిధర్మతేజ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడు. ఒకవైపు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాను విడుదల చేస్తూనే.. సేమ్ టైం సుప్రీం సినిమాను ప్రారంభించాడు సాయిధర్మతేజ. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుబోతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి  దర్శకుడు. ముహూర్తం […]

సాయిధర్మతేజ సుప్రీమ్ మొదలైంది
X
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సుప్రీం హీరో అనే పేరు ఉండేది. ఆ పేరునే టైటిల్ గా మార్చేస్తూ ఇప్పుడు ఓ సినిమా రాబోతోంది.మెగా కాంపౌండ్ కు చెందిన సాయిధర్మతేజ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడు. ఒకవైపు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాను విడుదల చేస్తూనే.. సేమ్ టైం సుప్రీం సినిమాను ప్రారంభించాడు సాయిధర్మతేజ. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుబోతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. ముహూర్తం షాట్ కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. బౌండెడ్ స్క్రిప్ట్ ను గోపీచంద్ మలినేని చేతులు మీదుగా సాయిధర్మతేజ, అనిల్ రావిపూడి సంయుక్తంగా అందుకున్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా నిర్థారించలేదు. మరోవైపు ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. సాయిధర్మతేజతోనే శతమానంభవతి అనే మరో సినిమాను కూడా ప్రారంభించబోతున్నాడు నిర్మాత దిల్ రాజు.
Photo Gallery: Supreme Movie Opening
First Published:  23 Sep 2015 7:06 PM GMT
Next Story