Telugu Global
Others

దక్షిణమధ్య రైల్వే తీర్ధయాత్ర ప్యాకేజీ

దక్షిణ భారతదేశ యాత్రకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) శ్రీకారం చుట్టింది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆలయాల యాత్ర కోసం ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నారు. రైలు నవంబరు 12న అర్ధరాత్రి సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరుతుందని, ఏడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని టూరిజం మేనేజర్‌ కె.అమ్మారావు తెలిపారు. ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుచ్చిరాపల్లి, శ్రీరంగం, తంజావూర్‌, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం సందర్శన ఉంటుందన్నారు. […]

దక్షిణమధ్య రైల్వే తీర్ధయాత్ర ప్యాకేజీ
X
దక్షిణ భారతదేశ యాత్రకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) శ్రీకారం చుట్టింది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆలయాల యాత్ర కోసం ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నారు. రైలు నవంబరు 12న అర్ధరాత్రి సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరుతుందని, ఏడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని టూరిజం మేనేజర్‌ కె.అమ్మారావు తెలిపారు. ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుచ్చిరాపల్లి, శ్రీరంగం, తంజావూర్‌, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం సందర్శన ఉంటుందన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని చెప్పారు. చార్జీలను కూడా ఆయన తెలిపారు. స్టాండర్డ్‌ (స్లీపర్‌ క్లాస్‌) రూ.6,370, కంఫర్ట్‌ (ఏసీ3టైర్‌ ) రూ.13,790, డీలక్స్‌ (ఏసీ2టైర్‌ ) రూ.18,550గా నిర్ణయించినట్టు చెప్పారు.
First Published:  23 Sep 2015 1:06 PM GMT
Next Story