Telugu Global
Cinema & Entertainment

షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్ సుడి తిరిగిన‌ట్లే..!

యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చూసే వారికి చాందిని చౌదరి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇన్నాళ్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవలే ‘కేటుగాడు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చాందినీ చౌదరికి మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్ బాబుతో కలిసి చాందిని చౌదరి స్టెప్స్ వేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ […]

షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్ సుడి తిరిగిన‌ట్లే..!
X

యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చూసే వారికి చాందిని చౌదరి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇన్నాళ్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవలే ‘కేటుగాడు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చాందినీ చౌదరికి మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్ బాబుతో కలిసి చాందిని చౌదరి స్టెప్స్ వేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. మహేష్ బాబుతో నటించడంతో తనకు మున్ముందు మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది. బ్రహ్మోత్సవం చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 7,2016న విడుదల చేయటానికి నిర్ణయంచినట్లు సమాచారం. అలాగే మార్చి నెలాఖరకు చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం.

First Published:  23 Sep 2015 7:12 PM GMT
Next Story