Telugu Global
Cinema & Entertainment

పోలెండ్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ జంట

పోలెండ్ దేశంలో వాతావరణం చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా సమశీతోష్ణస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వెదర్ ను ఇండియాలో ఆశించడం కష్టం. అందుకే సమంత-సూర్య పోలెండ్ కు ఫ్లాట్ అయిపోయారు. 2 రోజులు షూటింగ్ కు సెలవు పెట్టి మరీ దేశం చుట్టేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ జంట పోలెండ్ లోనే ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 అనే సైన్స్-ఫిక్షన్ సినిమా చేస్తోంది. ప్రస్తుతం పోలెండ్ లో సమంత-సూర్య మధ్య సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ […]

పోలెండ్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ జంట
X
పోలెండ్ దేశంలో వాతావరణం చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా సమశీతోష్ణస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వెదర్ ను ఇండియాలో ఆశించడం కష్టం. అందుకే సమంత-సూర్య పోలెండ్ కు ఫ్లాట్ అయిపోయారు. 2 రోజులు షూటింగ్ కు సెలవు పెట్టి మరీ దేశం చుట్టేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ జంట పోలెండ్ లోనే ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 అనే సైన్స్-ఫిక్షన్ సినిమా చేస్తోంది. ప్రస్తుతం పోలెండ్ లో సమంత-సూర్య మధ్య సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాను వచ్చేనెల నాటికి కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ వివరాల్ని మాత్రం ఇప్పటివరకు బయటకుచెప్పలేదు. మరోవైపు టాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా తెలుగు ప్రసార హక్కుల్ని హీరో నితిన్ దక్కించుకున్నాడు.
Next Story