Telugu Global
Cinema & Entertainment

పీకూకు అవార్డుల పంట

అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన పీకూ చిత్రం ఇంకా సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఇండియాలో హిట్టయిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. హార్ట్ టచింగ్ కథలో అమితాబ్ బచ్చన్ ఒదిగిపోయిన తీరు, దీపికా పదుకోన్, ఇర్ఫాన్ ఖాన్ నాచురల్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద బలాలుగా నిలిచాయి. తాజాగా ఈ చిత్రం రష్యాలో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా అవార్డుల […]

పీకూకు అవార్డుల పంట
X
అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన పీకూ చిత్రం ఇంకా సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఇండియాలో హిట్టయిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. హార్ట్ టచింగ్ కథలో అమితాబ్ బచ్చన్ ఒదిగిపోయిన తీరు, దీపికా పదుకోన్, ఇర్ఫాన్ ఖాన్ నాచురల్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద బలాలుగా నిలిచాయి. తాజాగా ఈ చిత్రం రష్యాలో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా అవార్డుల పంట పండించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో పురష్కారాలు ఎగరేసుకుపోయింది. సుజీత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ త్వరలోనే చైనా, ఆస్ట్రేలియా, వెనిస్ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితం కానుంది. అక్కడ ఈ మూవీ ఇంకెన్ని అవార్డులు అందుకుంటుందో చూడాలి.
Next Story