Telugu Global
CRIME

రూ. 3 కోట్ల విలువైన వజ్రాభరణాలు స్వాధీనం

భారీ చోరీ కేసును చేధించిన గుంటూరు రూరల్‌ పోలీసులు గుంటూరు జిల్లా బాపట్ల మండల పరిధిలోని చుండూరుపల్లిలోని ఎన్నారై ఇంటిలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని కేవలం మూడు గంటల వ్యవధిలో గుర్తించగలిగారు. చోరీకి పాల్పడిన నిందితుడితోపాటు అతనికి ఆశ్రయం కల్పించిన వారిలో ఒకరిని అరెస్ట్‌ చేసి వారి నుంచి చోరీకి గురైన రూ. 3 కోట్లకుపైగా ఖరీదైన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల పరిధిలోని చుండూరుపల్లికి చెందిన జాస్తి సాంబశివరావు అమెరికాలోని […]

భారీ చోరీ కేసును చేధించిన గుంటూరు రూరల్‌ పోలీసులు
గుంటూరు జిల్లా బాపట్ల మండల పరిధిలోని చుండూరుపల్లిలోని ఎన్నారై ఇంటిలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని కేవలం మూడు గంటల వ్యవధిలో గుర్తించగలిగారు. చోరీకి పాల్పడిన నిందితుడితోపాటు అతనికి ఆశ్రయం కల్పించిన వారిలో ఒకరిని అరెస్ట్‌ చేసి వారి నుంచి చోరీకి గురైన రూ. 3 కోట్లకుపైగా ఖరీదైన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల పరిధిలోని చుండూరుపల్లికి చెందిన జాస్తి సాంబశివరావు అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీలో డీన్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ఈ క్రమంలో తాను సంపాదించిన సొమ్ముతో కోట్ల ఖరీదు చేసే బంగారు, వజ్రాభరణాలు కొనుగోలు చేశారు. కుటుంబసభ్యులు రెండు నెలల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఈ నెల 15న దొంగలు ఆయన ఇంటి తాళం పగలగొట్టి రూ. 3 కోట్లకుపైగా ఖరీదైన బంగారు, వజ్రాభరణాలు అపహరించుకుపోయారు. అదే రోజు స్థానికులు ఇచ్చిన సమాచారంతో సాంబశివరావు ఈ నెల 17న చుండూరుపల్లి చేరుకున్నారు. రూరల్‌ ఎస్పీ నారాయణ్‌ నాయక్‌ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. వెంటనే బాపట్ల, రూరల్‌ సిసిఎస్‌ పోలీస్‌ బృందాలను అప్రమత్తం చేశారు. క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరించింది. క్లూస్‌టీమ్‌ సిబ్బంది నిందితుడిని మూడు గంటల వ్యవధిలోనే గుర్తించింది. దీంతో ఐటికోర్‌ సిబ్బంది సహకారంతో సిసిఎస్‌ పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితుడి కదలికలను గుర్తించి ఏ మాత్రం ఆలస్యం కాకుండా వెంటాడారు. చివరకు చోరీకి పాల్పడిన నిందితుడు, అతనికి ఆశ్రయించిన వారిలో ఒకరిని సిసిఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చాకచక్యంగా కేసును ఛేదించిన దీంతో రూరల్‌ ఎస్పీ నారాయణ్‌ నాయక్‌తోపాటు మిగిలిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని డిజిపి రాముడు ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.

First Published:  23 Sep 2015 1:23 PM GMT
Next Story