Telugu Global
NEWS

చిరంజీవికి హైకోర్టులో ఊరట

ఓ కేసుకు సంబంధించి చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2008లో రిజిస్టర్ అయిన ఈ కేసును కోర్టు కొట్టేసింది. గతంలో ప్రజారాజ్యం పెట్టి ఆ పార్టీ ప్రెసిడెంట్ గా చిరంజీవి కొనసాగిన టైమ్‌లో కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ రోడ్ షో నిర్వహించారు చిరంజీవి. దానికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని వాదిస్తున్నారు పోలీసులు. పైగా ట్రాఫిక్ నిబంధనలు అన్నీ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. చెల్లని […]

చిరంజీవికి హైకోర్టులో ఊరట
X
ఓ కేసుకు సంబంధించి చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2008లో రిజిస్టర్ అయిన ఈ కేసును కోర్టు కొట్టేసింది. గతంలో ప్రజారాజ్యం పెట్టి ఆ పార్టీ ప్రెసిడెంట్ గా చిరంజీవి కొనసాగిన టైమ్‌లో కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ రోడ్ షో నిర్వహించారు చిరంజీవి. దానికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని వాదిస్తున్నారు పోలీసులు. పైగా ట్రాఫిక్ నిబంధనలు అన్నీ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. చెల్లని పిటిషన్ గా తేల్చిచెప్పింది. ఎవరైనా వ్యక్తులు కంప్లయిట్ ఇస్తే దానికి విలువ ఉంటుంది తప్ప.. పోలీసులు ఏకపక్షంగా కేసు వేసినట్టు ఉందని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు చిరంజీవి తరఫు లాయర్ చేసిన వాదనలతో కోర్టు పూర్తిగా ఏకీభవించింది. దీంతో కేసును పరిగణనలోకి తీసుకోబోమని ప్రకటించింది.
First Published:  23 Sep 2015 10:57 PM GMT
Next Story