Telugu Global
Others

జగన్‌ ఆమరణ దీక్షకు అనుమతి నిరాకరణ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షడు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలో తలపెట్టిన నిరాహారదీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రతిపాదిత దీక్షా ప్రాంగణానికి దగ్గరలో విద్యాసంస్థలు, వైద్యాలయాలు ఉన్నందున అనుమతించడం సాధ్యం కాదని పోలీసులు కారణాలు చెబుతున్నారు. అయితే దీక్షకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చకచకా ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతోంది. మంగళవారం ఈ ప్రాంతంలో ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఆర్‌.కె.రోజా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీక్షకు మరో 48 గంటల సమయం మాత్రమే ఉండడంతో […]

జగన్‌ ఆమరణ దీక్షకు అనుమతి నిరాకరణ
X
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షడు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలో తలపెట్టిన నిరాహారదీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రతిపాదిత దీక్షా ప్రాంగణానికి దగ్గరలో విద్యాసంస్థలు, వైద్యాలయాలు ఉన్నందున అనుమతించడం సాధ్యం కాదని పోలీసులు కారణాలు చెబుతున్నారు. అయితే దీక్షకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చకచకా ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతోంది. మంగళవారం ఈ ప్రాంతంలో ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఆర్‌.కె.రోజా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీక్షకు మరో 48 గంటల సమయం మాత్రమే ఉండడంతో ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు. అయితే పోలీసులు పార్టీ ఏర్పాటు చేసుకున్న టెంట్‌లు తొలగించాలని, వేదికను తీసి వేయాలంటూ సంఘటన స్థలికి వచ్చి హడావుడి చేస్తున్నారు. దాంతో అక్కడున్న నాయకులు పోలీసులతో వాదనకు దిగారు. ఎంతోముందు ప్రకటించినప్పటికీ దీక్షా సమయం దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి నిరాకరించడం ఏమిటని పోలీసులను నాయకులు నిలదీస్తున్నారు. ముందుగా చెబితే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉండేదని, సమయం లేకుండా చెప్పడం రాజకీయ కుట్ర తప్ప మరేమిటని వారు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ దమననీతిని ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే ఇలాంటి వేషాలు వేస్తోందని వారు విమర్శించారు.
First Published:  23 Sep 2015 4:15 AM GMT
Next Story