Telugu Global
Others

దొంగనోట్ల కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లాలో ఓ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దొంగనోట్ల కేసులో చిక్కుకున్నారని తెలుస్తోంది. అతని ముఖ్య అనుచరుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు. చత్తీస్‌గఢ్‌ పోలీసులు పథకం ప్రకారం ఈ అనుచరుడ్ని అరెస్టు చేశారని అంటున్నారు. ఈ దొంగనోట్ల కేసు నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ఉండడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యేని పోలీసులు ప్రశ్నించారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఈ ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్‌ ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఈ […]

నల్లగొండ జిల్లాలో ఓ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దొంగనోట్ల కేసులో చిక్కుకున్నారని తెలుస్తోంది. అతని ముఖ్య అనుచరుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు. చత్తీస్‌గఢ్‌ పోలీసులు పథకం ప్రకారం ఈ అనుచరుడ్ని అరెస్టు చేశారని అంటున్నారు. ఈ దొంగనోట్ల కేసు నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ఉండడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యేని పోలీసులు ప్రశ్నించారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఈ ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్‌ ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఈ ఎమ్మెల్యే ఎవరన్నది పేరు బయటకు రాలేదు. నల్లగొండ జిల్లాలో ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నారు. వీరిలో జగదీష్‌రెడ్డి మంత్రిగా ఉండగా మిగిలిన ఐదుగురిలో శేఖర్ రెడ్డి( భువనగిరి), గాదరి కిషోర్(తుంగతుర్తి), ప్రభాకరరెడ్డి(మునుగోడు), వేముల వీరేశం(నకిరేకల్), సునీత( ఆలేరు) టీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎవరున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే… దొంగనోట్ల కేసులో ఇరుక్కున్నారంటే అది టీఆర్‌ఎస్‌కు పెద్ద మచ్చనే తెచ్చిపెట్టడం ఖాయం.
First Published:  21 Sep 2015 1:05 PM GMT
Next Story