Telugu Global
Cinema & Entertainment

 పులి కి ముహుర్తం  కుదిరింది..!

బాహుబ‌లి రిలీజ్ స‌మ‌యంలో కోలీవుడ్ జ‌నాలు..  పులి చిత్రం గురించి కొంత హ‌డావుడి చేశారు.  గ్రాఫిక్స్ విష‌యంలో  బాహుబ‌లి కి  ధీటుగా వుంటుంది..   ఆ సినిమా రిలీజ్ టైమ్ లోనే పులి కూడా వర‌ల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపించింది.  క‌ట్ చేస్తే  అదేమి జ‌ర‌గ‌లేదు.   శ్రీ‌దేవి కీల‌క రోల్ చేసిన ఈ   చిత్రం  తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.  గ‌తంలో తుపాకి చిత్రంతో  మంచి విజ‌యం అందుకున్న విజ‌య్ .. ఈసారి శ్రీ‌దేవి,  శృతిహాసన్, […]

 పులి కి ముహుర్తం  కుదిరింది..!
X

బాహుబ‌లి రిలీజ్ స‌మ‌యంలో కోలీవుడ్ జ‌నాలు.. పులి చిత్రం గురించి కొంత హ‌డావుడి చేశారు. గ్రాఫిక్స్ విష‌యంలో బాహుబ‌లి కి ధీటుగా వుంటుంది.. ఆ సినిమా రిలీజ్ టైమ్ లోనే పులి కూడా వర‌ల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపించింది. క‌ట్ చేస్తే అదేమి జ‌ర‌గ‌లేదు. శ్రీ‌దేవి కీల‌క రోల్ చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. గ‌తంలో తుపాకి చిత్రంతో మంచి విజ‌యం అందుకున్న విజ‌య్ .. ఈసారి శ్రీ‌దేవి, శృతిహాసన్, హ‌న్సిక ల‌తో వ‌స్తున్నాడు. దీంతో ఒక హీరో త‌ప్ప‌..మిగిలిన వారంతా తెలుగు ఆడియ‌న్స్ కు బాగా దగ్గ‌రైన వారే…!

శింబు దేవ‌న్ ఈ చిత్రాన్ని ఒక సోషియో ఫాంటిసి ఫిల్మ్ గా తీర్చి దిద్దారు. భారీ బ‌డ్జెట్ తో చేశారు. ట్రైల‌ర్స్, ప్ర‌చార చిత్రాలు అంచాలు పెంచాయి. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని.. అక్టోబ‌ర్ 1 న పులి చిత్రం త‌మిళ‌, తెలుగు తో పాటు.. ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారని టాక్. మ‌రి ఎంతో హైపు తో వ‌స్తున్న పులి చిత్రం ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో..?

Next Story