Telugu Global
Cinema & Entertainment

వినాయ‌కుడి దీవెన‌ల‌తో  బాల‌య్య సంక్రాంతి బరిలోకి రెడీ..!

సెంటిమెంట్స్ విష‌యంలో  సినిమా వారికి పోటి  ఎవ‌రు సాటి రారు.  ఇండ‌స్ట్రీలో  స‌క్సైస్ ప‌వ‌ర్ ఫుల్ ఎలిమెంట్ కావడంతో..  అది అందుకోవ‌డం కోసం.. నిలుపుకోవ‌డం కోసం.. బౌన్స్ బ్యాక్  కావ‌డం కోసం మ‌రి కొంద‌రు..  ఇలా  ఎవ‌రు చేసిన చేసినా..ఏదో ఒక సెంటిమెంట్  ఆ చిత్ర యూనిట్ లో క‌చ్చితంగా ఉంటుంది. కొంద‌రు కాంబినేష‌న్ సెంటిమెంట్ .. మ‌రి కొంద‌రికి దేవుడి సెంటిమెంట్.. ఇంకొంద‌రికి.. హీరోయిన్ సెంటిమెంట్..  ఇలా అనేకం వుంటాయి.  క‌ట్ చేస్తే..  బాల‌య్య  తాజాగా   […]

వినాయ‌కుడి దీవెన‌ల‌తో  బాల‌య్య సంక్రాంతి బరిలోకి రెడీ..!
X

సెంటిమెంట్స్ విష‌యంలో సినిమా వారికి పోటి ఎవ‌రు సాటి రారు. ఇండ‌స్ట్రీలో స‌క్సైస్ ప‌వ‌ర్ ఫుల్ ఎలిమెంట్ కావడంతో.. అది అందుకోవ‌డం కోసం.. నిలుపుకోవ‌డం కోసం.. బౌన్స్ బ్యాక్ కావ‌డం కోసం మ‌రి కొంద‌రు.. ఇలా ఎవ‌రు చేసిన చేసినా..ఏదో ఒక సెంటిమెంట్ ఆ చిత్ర యూనిట్ లో క‌చ్చితంగా ఉంటుంది. కొంద‌రు కాంబినేష‌న్ సెంటిమెంట్ .. మ‌రి కొంద‌రికి దేవుడి సెంటిమెంట్.. ఇంకొంద‌రికి.. హీరోయిన్ సెంటిమెంట్.. ఇలా అనేకం వుంటాయి.
క‌ట్ చేస్తే.. బాల‌య్య తాజాగా నివాస్ డైరెక్ష‌న్ లో చేస్తున్న డిక్టేట‌ర్ చిత్రం వినాయ‌కుడి సెంటిమెంట్ తో చేస్తున్నారు. మొన్న వినాయ‌క చ‌తుర్ధి రోజు .. ఖైరాతాబాద్ వినాయ‌కుడి స‌మక్షంలో ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ గం గం గ‌ణేష్ అంటూ ఫుల్ సాంగ్ వినాయ‌కుడి గురించే వుంది. తాజాగా ఈ సాంగ్ నెల్ లో హల్ చ‌ల్ చేస్తుంది. బాల‌య్య ఫ‌స్ట్ లుక్ కూడా టైటిల్ కు త‌గ్గ‌ట్టు రిలీజ్ చేసి.. సినిమా పై బాల‌య్య ఫ్యాన్స్ లో అంచ‌నాలు పెంచేశారు. ఇదిలా వుంటే.. డిక్టేట‌ర్ చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో దింప‌డానికి రంగం సిద్దం చేశారు. జ‌న‌వ‌రి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు. సో ఇలా వినాయ‌కుడి దీవెన‌ల‌తో ..బాల‌య్య సంక్రాంతి బ‌రిలో సిద్దం అయ్యాడు. అన్న‌ట్లు బాల‌య్య కెరీర్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో స‌క్సెస్ శాతం చాల ఎక్కువ వుందండోయ్..! దీంతో డిక్టేట‌ర్ తో హిట్ కొడ‌తాడ‌నే ఆశిస్తున్నారు ఫ్యాన్స్ మ‌రి. లెజెండ్ రేంజ్ లో హిట్ ప‌డాలని ఆశిస్తున్నారు ఆయ‌న వీరాభిమానులు . లెట్స్ హోప్ సో.!

Next Story