Telugu Global
CRIME

పోలీసు చెక్‌పోస్టుపైకి లారీ...కానిస్టేబుల్‌ మృతి

హైదరాబాద్‌లోని గోల్కొండ దగ్గర పోలీసులు పహారా కాస్తున్న చెక్‌పోస్టుపైకి ఓ లారీ దూసుకుపోయింది. ఈ సంఘటనలో రాహుల్‌ యాదవ్‌ అనే కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మరణించాడు. వేగంగా వస్తున్న రెడీమిక్స్‌ లారీ అదుపు తప్పి పోలీసు చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లింది. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు వీరేందర్‌, పవన్‌, సైదులుకు గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుళ్లను ఆపోలో, కేర్‌ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స జరిపిస్తున్నారు. పోలీసులు లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రమాద స్థలాన్ని సందర్శించి సంఘటనపై ఆరా […]

హైదరాబాద్‌లోని గోల్కొండ దగ్గర పోలీసులు పహారా కాస్తున్న చెక్‌పోస్టుపైకి ఓ లారీ దూసుకుపోయింది. ఈ సంఘటనలో రాహుల్‌ యాదవ్‌ అనే కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మరణించాడు. వేగంగా వస్తున్న రెడీమిక్స్‌ లారీ అదుపు తప్పి పోలీసు చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లింది. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు వీరేందర్‌, పవన్‌, సైదులుకు గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుళ్లను ఆపోలో, కేర్‌ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స జరిపిస్తున్నారు. పోలీసులు లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రమాద స్థలాన్ని సందర్శించి సంఘటనపై ఆరా తీశారు.
Next Story