కబలి తో పాటు రోబో-2 కూడా..
వినాయకచవితి రోజున కబలి సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అదే రోజు నుంచి చెన్నైలోని మోహన్ స్టుడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించాడు. అయితే ఇదంతా అందరికీ తెలిసిందే. మరో కొత్త విషయం ఏంటంటే.. ఈసారి రజనీకాంత్ ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు. అవును.. కబలి సినిమాతో పాటు కుదిరితే రోబో-2ను కూడా రజనీకాంత్ సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఈమేరకు ఏర్పాట్లు చేయమని దర్శకుడు శంకర్ కు సూచించాడట […]
BY admin20 Sep 2015 9:00 PM GMT

X
admin20 Sep 2015 9:00 PM GMT
వినాయకచవితి రోజున కబలి సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అదే రోజు నుంచి చెన్నైలోని మోహన్ స్టుడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించాడు. అయితే ఇదంతా అందరికీ తెలిసిందే. మరో కొత్త విషయం ఏంటంటే.. ఈసారి రజనీకాంత్ ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు. అవును.. కబలి సినిమాతో పాటు కుదిరితే రోబో-2ను కూడా రజనీకాంత్ సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఈమేరకు ఏర్పాట్లు చేయమని దర్శకుడు శంకర్ కు సూచించాడట రజనీ. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న రోబో-2ను లాంఛ్ చేసి.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యేట్టు ప్లాన్ చేస్తున్నారు. అంటే..జనవరి నుంచి కబలి తోపాటు రోబో-2 కూడా సెట్స్ పై సైమల్టేనియస్ గా రన్ అవుతుందన్నమాట.
Next Story