Telugu Global
Others

వడ్డీ రేట్ల తగ్గింపులో ఆర్బీఐకి స్వేచ్ఛ: జైట్లీ

వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో రిజర్వు బ్యాంకుదే తుది నిర్ణయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ నెల చివర్లో నిర్వహించనున్న ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్‌బీఐపై ఒత్తిడి తీవ్రతరమైన నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పావు శాతం చొప్పున మూడు దఫాలుగా వడ్డీరేట్లను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తగ్గించినప్పటికీ మందకొడిగా కొనసాగుతున్న పారిశ్రామిక రంగాన్ని మళ్లీ వృద్ధి […]

వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో రిజర్వు బ్యాంకుదే తుది నిర్ణయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ నెల చివర్లో నిర్వహించనున్న ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్‌బీఐపై ఒత్తిడి తీవ్రతరమైన నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పావు శాతం చొప్పున మూడు దఫాలుగా వడ్డీరేట్లను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తగ్గించినప్పటికీ మందకొడిగా కొనసాగుతున్న పారిశ్రామిక రంగాన్ని మళ్లీ వృద్ధి బాట పట్టించాలంటే కనీసం పావు శాతమైన కోత పెట్టాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. రేట్ల తగ్గింపు విషయంపై రాజన్ బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తున్నారని మెచ్చుకున్నారు. గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీరేట్ల కారణంగా రియల్ ఎస్టేట్‌తోపాటు ఇతర రంగాలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని మంత్రి వెల్లడించారు.

First Published:  20 Sep 2015 1:22 PM GMT
Next Story