Telugu Global
Cinema & Entertainment

మెగా అభిమానుల‌కు పండ‌గే..!

మెగా  హీరోల అభిమానుల‌కు ఏదైనా పండ‌గే.  ఆడియో విడుద‌ల‌.టీజ‌ర్ విడుద‌ల‌,  సినిమా రిలీజ్ అంటే పెద్ద పండ‌గ‌.  ఒక హీరోకు సంబంధించిన సినిమాకే భారీ హ‌డావుడిచేస్తారు.ఇక ఒకే వారంలో   మూడు ఈ వెంట్స్ వుంటే ఎలా వుంటుంది..  పండ‌గ‌లే మ‌రి.  ఈ మేరకు ఆయా వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు సంసిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య స్మారక అవార్డు సెర్మనీ జరుగబోతోంది. ఈ సంవత్సరం ఈ అవార్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఎంపిక చేసారు. ఈ […]

మెగా అభిమానుల‌కు పండ‌గే..!
X
మెగా హీరోల అభిమానుల‌కు ఏదైనా పండ‌గే. ఆడియో విడుద‌ల‌.టీజ‌ర్ విడుద‌ల‌, సినిమా రిలీజ్ అంటే పెద్ద పండ‌గ‌. ఒక హీరోకు సంబంధించిన సినిమాకే భారీ హ‌డావుడిచేస్తారు.ఇక ఒకే వారంలో మూడు ఈ వెంట్స్ వుంటే ఎలా వుంటుంది.. పండ‌గ‌లే మ‌రి. ఈ మేరకు ఆయా వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు సంసిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య స్మారక అవార్డు సెర్మనీ జరుగబోతోంది. ఈ సంవత్సరం ఈ అవార్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఎంపిక చేసారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. చిరంజీవి చేతుల మీదుగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అవార్డు అందుకోబోతున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరు కాబోతున్నారు.
తర్వాతి రోజు, అంటే అక్టోబర్ 2న అభిమానులకు మరింత సంతోషకరమైన రోజు. ఈ రోజు వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ చిత్రం విడుదల కాబోతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా ఇది. అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా ఆడియో వేడుక జరుగబోతోంది. హైదరాబాద్ లో ఈ వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు కూడా చిరంజీవి హాజరు కాబోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘బ్రూస్ లీ’ సినిమా అక్టోబర్ 16న విడుదల కాబోతోంది. సో అక్టోబ‌ర్ మొద‌టి వారం మెగా ఫ్యాన్స్ దే మ‌రి.
First Published:  20 Sept 2015 11:00 PM GMT
Next Story