Telugu Global
Others

Wonder World 32

జిమ్‌లలో క్లాసికల్‌ మ్యూజిక్‌! మ్యూజిక్‌ వింటూ ఎక్సర్‌సైజ్‌ చేయడం జిమ్‌లలో ఇపుడు చాలా కామన్‌. రకరకాల ఫాస్ట్‌ బీట్‌లు, గందరగోళంగా ఉండే పాటలు పెడుతుంటారు. అయితే మనం వ్యాయామం చేస్తున్నపుడు ఏది పడితే అది వినడం కాకుండా క్లాసికల్‌ మ్యూజిక్‌ వినడం వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా రక్తపోటు తగ్గుతుందని, గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుందని శరీరం విశ్రాంత స్థితిలోకి చేరుతుందని బ్రిటన్‌కు చెందిన న్యూరో సైంటిస్ట్‌ జాక్‌ లెవిస్‌ తెలిపారు. […]

Wonder World 32
X

జిమ్‌లలో క్లాసికల్‌ మ్యూజిక్‌!

మ్యూజిక్‌ వింటూ ఎక్సర్‌సైజ్‌ చేయడం జిమ్‌లలో ఇపుడు చాలా కామన్‌. రకరకాల ఫాస్ట్‌ బీట్‌లు, గందరగోళంగా ఉండే పాటలు పెడుతుంటారు. అయితే మనం వ్యాయామం చేస్తున్నపుడు ఏది పడితే అది వినడం కాకుండా క్లాసికల్‌ మ్యూజిక్‌ వినడం వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా రక్తపోటు తగ్గుతుందని, గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుందని శరీరం విశ్రాంత స్థితిలోకి చేరుతుందని బ్రిటన్‌కు చెందిన న్యూరో సైంటిస్ట్‌ జాక్‌ లెవిస్‌ తెలిపారు. ఫిట్‌గా ఉండడం కోసం వ్యాయామం చేసేవారు గందరగోళ మ్యూజిక్‌ కాకుండా సాంప్రదాయ సంగీతాన్ని వింటూ వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఎక్కువగా కనిపిస్తుందని ఆయన అంటున్నారు. మరింత కఠినమైన ఎక్సర్‌సైజులు చేయాలని, మరింత ఎక్కువ సేపు ఎక్సర్‌సైజులు చేస్తేనే ఫలితం ఉంటుందని చాలా మంది భావిస్తుంటారని, కానీ సాంప్రదాయ సంగీతం వింటూ సాధారణ ఎక్సర్‌సైజలు చేసినా ఎక్కువ ఫలితం కనిపిస్తుందని లెవిస్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. ఉత్తేజకరంగా ఉండాలనే ఉద్దేశంతో రకరకాల ఫాస్ట్‌ బీట్‌ పాటలను జిమ్‌లలో వినిపించడం సరికాదని లెవిస్‌ చెబుతున్నారు. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయని, మన శరీరం వేగంగా స్పందించడం, హార్ట్‌బీట్‌ పెరగడం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కానీ సాంప్రదాయ సంగీతం వల్ల శరీరం విశ్రాంత స్థితికి చేరుకుంటుందని లెవిస్‌ తెలిపారు. సాంప్రదాయ సంగీతం వింటూ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల మన శరీరంలో మానసిక వత్తిడిని పెంచే కార్టిజోల్‌ అనే హార్మోన్‌ స్థాయి తగ్గుతున్నట్లు పరిశోధనలలో తేలిందని లెవిస్‌ పేర్కొన్నారు. ఎక్సర్‌సైజ్‌ ప్రారంభించే సమయంలో (వామప్‌ సమయంలో) శరీరాన్ని మోటివేట్‌ చేయడం కోసం కొద్దిసేపు ఫాస్ట్‌ బీట్‌ సంగీతం వినడం మంచిదేనని, అయితే ఆసాంతం దానినే కొనసాగించరాదని లెవిస్‌ చెబుతున్నారు.

First Published:  19 Sep 2015 1:04 PM GMT
Next Story