Telugu Global
Cinema & Entertainment

కిల్లింగ్‌ వీరప్పన్  కు డేట్ ఫిక్స్ అయ్యింది..! 

గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతుూ మరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కన్నడ,హిందీ, తెలుగులో ఈ చిత్రం రూపొందుతోంది.ఇక ఆ మధ్యన చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. […]

కిల్లింగ్‌ వీరప్పన్  కు డేట్ ఫిక్స్ అయ్యింది..! 
X
గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతుూ మరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కన్నడ,హిందీ, తెలుగులో ఈ చిత్రం రూపొందుతోంది.ఇక ఆ మధ్యన చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూసిన వారు..వర్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు.
వీరప్పన్‌ కథాంశంతో ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ అనే టైటిల్ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. అలాగే ఇప్పుడు ఆయన ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదలకానుంది.
కన్నడ హీరో శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 12న విడుదల చేయనున్నారు.
First Published:  20 Sep 2015 4:13 AM GMT
Next Story