Telugu Global
Others

Wonder World 31

అంతరిక్షంలో గీత రచన! వృత్తికి కంకణబద్ధులై అందులోనే పడి కొట్టుకుపోతుంటారు కొందరు. మరికొందరుంటారు… వృత్తికి న్యాయం చేస్తూనే అభిరుచులనూ తీర్చుకుంటుంటారు. కెనడా వ్యోమగామి క్రిస్‌ హాడిఫీల్డ్‌ ఇందులో రెండోకోవకు చెందినవాడు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న హాడిఫీల్డ్‌ పనిలో పనిగా తన అభిరుచి మేరకు అక్కడే ఓ పాట రాసి దాని రికార్డింగ్‌ కూడా పూర్తి చేశాడు. టొరంటోలో ఉన్న ఓ స్టూడియో సిబ్బంది శాటిలైట్‌ సాయంతో ఇందుకు సహాయపడ్డారనుకోండి. ‘బేర్‌నేకెడ్‌ లేడీస్‌’ గాయకుడు […]

Wonder World 31
X

అంతరిక్షంలో గీత రచన!
వృత్తికి కంకణబద్ధులై అందులోనే పడి కొట్టుకుపోతుంటారు కొందరు. మరికొందరుంటారు… వృత్తికి న్యాయం చేస్తూనే అభిరుచులనూ తీర్చుకుంటుంటారు. కెనడా వ్యోమగామి క్రిస్‌ హాడిఫీల్డ్‌ ఇందులో రెండోకోవకు చెందినవాడు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న హాడిఫీల్డ్‌ పనిలో పనిగా తన అభిరుచి మేరకు అక్కడే ఓ పాట రాసి దాని రికార్డింగ్‌ కూడా పూర్తి చేశాడు. టొరంటోలో ఉన్న ఓ స్టూడియో సిబ్బంది శాటిలైట్‌ సాయంతో ఇందుకు సహాయపడ్డారనుకోండి. ‘బేర్‌నేకెడ్‌ లేడీస్‌’ గాయకుడు ఎడ్‌ రాబర్ట్‌సన్‌ కూడా హాడిఫీల్డ్‌కు ఇతోధికంగా సాయపడ్డాడు. భూమికి 402 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రంలో హాడిఫీల్డ్‌ పాట రాయడం, దానిని రికార్డింగ్‌ కూడా పూర్తి చేయడం ఓ ప్రపంచ రికార్డుగా నమోదయ్యింది. అంతరిక్షంలో పాట రాయడం, రికార్డింగ్‌ చేయడం ఇదే మొట్టమొదటిసారి మరి. హాడిఫీల్డ్‌ రాసిన పాట పేరు ఐఎస్‌ఎస్‌ అంటే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ అనుకునేరు. ‘ఈజ్‌ సమ్‌బడీ సింగింగ్‌’ దాని పూర్తి రూపం. రెండూ కలసివచ్చేలా అలా పెట్టి ఉంటాడాయన. భూమిపైన ఉన్న ఆత్మీయులందరికీ దూరంగా అంతరిక్షంలో గడిపే ఓ వ్యోమగామి అనుభవాలు, ఫీలింగ్స్‌ అన్నీ కలగలిపి హాడీఫీల్డ్‌ ఈ పాట రాశాడు. ఇవి ఆయన సొంత అనుభవాలు.. భావాలూను. హాడిఫీల్డ్‌, రాబర్ట్‌సన్‌ పదేళ్ల నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు. పదేళ్ల క్రితం హూస్టన్‌లోని మిషన్‌ కంట్రోల్‌ కార్యాలయంలో ‘బేర్‌నెకెడ్‌ లేడీస్‌’ బ్యాండ్‌ ఓ ప్రదర్శన ఇచ్చిన సందర్భంలో ఇద్దరికీ పరిచయమేర్పడింది. హాడిఫీల్డ్‌ పాటలో బేర్‌నేకెడ్‌ లేడీస్‌ ట్రూప్‌తో పాటు వెక్స్‌ఫోర్డ్‌ కాలేజియేట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు కూడా పాలు పంచుకున్నారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోని అబ్జర్వేషన్‌ డెస్క్‌ (కుపోలా) నుంచి హాడిఫీల్డ్‌ గిటార్‌ ప్లే చేస్తూ ఈ పాట వీడియో రికార్డింగ్‌ కూడా పూర్తిచేశారు. కుపోలా నుంచి భూమిని చూడడం ఓ అందమైన అనుభూతి అని హాడిఫీల్డ్‌ పేర్కొన్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పాటలు పాడడం కొత్తేమీ కాదు. హాడీఫీల్డ్‌ కన్నా ముందే 2011 ఏప్రిల్‌లో క్యాడీ కోల్‌మన్‌ అనే మరో వ్యోమగామి ‘బౌరీ’ పాటను పాడారు. జెత్రో తల్స్‌ బ్యాండ్‌కి చెందిన ఇయాన్‌ ఆండర్సన్‌ భూమిపై నుంచి ఆ పాటకు సహాయసహకారాలందించారు. అయితే హాడీ ఫీల్డ్‌ సాధించిన ఘనతేమిటంటే అంతరిక్ష కేంద్రంలోనే ఒక కొత్త పాట రాయడం, దానిని అక్కడి నుంచి రికార్డింగ్‌ పూర్తి చేయడం. అదన్నమాట సంగతి…

First Published:  18 Sep 2015 1:04 PM GMT
Next Story