Telugu Global
NEWS

కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

విశాఖలోని హార్బర్ పార్క్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ దారుణం చోటు చేసుకుంది. శివకేశవ్ అనే రెండేళ్ల బాలుడిపై కుక్కలు దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశాయి. ఆరుబయట ఆడుకుంటున్న ఈ చిన్నారిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గతంలో గుంటూరుజిల్లాలో కుక్కలు పాశవికంగా దాడిచేసి ఒక బాబును చీల్చి చంపడం, గుంటూరు ఆసుపత్రిలో […]

కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి
X
విశాఖలోని హార్బర్ పార్క్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ దారుణం చోటు చేసుకుంది. శివకేశవ్ అనే రెండేళ్ల బాలుడిపై కుక్కలు దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశాయి. ఆరుబయట ఆడుకుంటున్న ఈ చిన్నారిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గతంలో గుంటూరుజిల్లాలో కుక్కలు పాశవికంగా దాడిచేసి ఒక బాబును చీల్చి చంపడం, గుంటూరు ఆసుపత్రిలో ఒక బాబును ఎలుకలు పీక్కు తినడం వంటి సంఘటనలు మరువకముందే మళ్ళీ అలాంటి సంఘటన జరగడంతో ప్రభుత్వం అవమానంగా భావిస్తోంది.
First Published:  18 Sep 2015 1:09 PM GMT
Next Story