Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమా పేరు అదే..

అంతా ఊహించిందే జరిగింది. ఎలాంటి ఆశ్చర్యకర పరిణామాలు లేవు. ఎన్టీఆర్ సినిమా పేరు మొదట్నుంచి అనుకున్నదే పక్కా అయింది. సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేస్తున్న సినిమాకు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేశారు. ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను వినాయకచవితి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. డిసెంబర్ నాటికి సినిమాతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా […]

ఎన్టీఆర్ సినిమా పేరు అదే..
X
అంతా ఊహించిందే జరిగింది. ఎలాంటి ఆశ్చర్యకర పరిణామాలు లేవు. ఎన్టీఆర్ సినిమా పేరు మొదట్నుంచి అనుకున్నదే పక్కా అయింది. సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేస్తున్న సినిమాకు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేశారు. ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను వినాయకచవితి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. డిసెంబర్ నాటికి సినిమాతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా పూర్తిచేసి, జనవరి 8కి సినిమాకు థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. సినిమాలో తారక్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాటల్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా మొత్తం లండన్ బ్యాక్ డ్రాప్ లో జరగడం మరో విశేషం.
First Published:  17 Sep 2015 2:00 AM GMT
Next Story