Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్  కెమెరా ముందుకొ్చ్చేశాడు.

సీత‌మ్మ వాకిట్లో  సిరిమ‌ల్లె చెట్టు వంటి  ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ తో  మెప్పించిన శ్రీ‌కాంత్ అడ్డాల  తాజాగా    మ‌రో   ఫ్యామిలీ డ్రామ సినిమా చేస్తున్నారు.  అదే  ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి మొదలవుతోంది. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం ఒకేసారి ప్రారంభమవుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో నేడు మొదలయ్యే షూటింగ్ పదిరోజుల పాటు సాగనుంది. మొదటి […]

మ‌హేష్  కెమెరా ముందుకొ్చ్చేశాడు.
X

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు వంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ తో మెప్పించిన శ్రీ‌కాంత్ అడ్డాల తాజాగా మ‌రో ఫ్యామిలీ డ్రామ సినిమా చేస్తున్నారు. అదే ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి మొదలవుతోంది. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం ఒకేసారి ప్రారంభమవుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో నేడు మొదలయ్యే షూటింగ్ పదిరోజుల పాటు సాగనుంది. మొదటి ఐదు రోజులు ఓ ఫ్యామిలీ సాంగ్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మహేష్‌తో పాటు ఈ షెడ్యూల్‌లో మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారు. సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతోంది. న‌య‌నానందకరంగా సినిమా ఉండేలా ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల కేర్ తీసుకుంటున్నార‌ట‌.

Next Story