Telugu Global
Cinema & Entertainment

క‌రీనా క‌పూర్  నిర్మాత అయ్యిందోచ్..!

ఎక్క‌డ  ఆడ‌వాళ్లు పూజింప బ‌డ‌తారో.. అక్క‌డ  దేవ‌త‌లు తిరుగుతార‌ని  మ‌న మ‌త గ్రంధాలు చెప్పాయి.  కానీ ప్ర‌జెంట్ గ్లోబ‌లైజేష‌న్  ప్ర‌పంచంలో.. ఆడ‌పిల్ల పుట్ట‌కు ముందే చంపే వారి సంఖ్య ఎక్కువ‌య్యింది. కార‌ణాలు   ఒక్క‌టి అని చెప్ప‌లేం. భార‌తీయ స‌మాజంలో    మ‌గ పిల్ల‌వాడికి మొద‌టి నుంచి వున్న ప్రాధ్యన్య‌త‌..   క్ర‌మేపి  ఆడ‌పిల్ల పాలిటి శాపంగా మారింది.  దీంతో  ఆడపిల్ల‌ను  కాపాడుకోవ‌డానికి  ఎన్నో విధాల ప్ర‌య‌త్నాలు  చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ దిశ గా  బాలీవుడ్ సెలిబ్రిటీలు   ప్రియాంక చోప్రా.. ఫ్రిదా […]

క‌రీనా క‌పూర్  నిర్మాత అయ్యిందోచ్..!
X

ఎక్క‌డ ఆడ‌వాళ్లు పూజింప బ‌డ‌తారో.. అక్క‌డ దేవ‌త‌లు తిరుగుతార‌ని మ‌న మ‌త గ్రంధాలు చెప్పాయి. కానీ ప్ర‌జెంట్ గ్లోబ‌లైజేష‌న్ ప్ర‌పంచంలో.. ఆడ‌పిల్ల పుట్ట‌కు ముందే చంపే వారి సంఖ్య ఎక్కువ‌య్యింది. కార‌ణాలు ఒక్క‌టి అని చెప్ప‌లేం. భార‌తీయ స‌మాజంలో మ‌గ పిల్ల‌వాడికి మొద‌టి నుంచి వున్న ప్రాధ్యన్య‌త‌.. క్ర‌మేపి ఆడ‌పిల్ల పాలిటి శాపంగా మారింది. దీంతో ఆడపిల్ల‌ను కాపాడుకోవ‌డానికి ఎన్నో విధాల ప్ర‌య‌త్నాలు చేసుకోవాల్సి వ‌చ్చింది.
ఈ దిశ గా బాలీవుడ్ సెలిబ్రిటీలు ప్రియాంక చోప్రా.. ఫ్రిదా ప్రింటోలు రైజింగ్ ది గాళ్ చైల్డ్ అనే పేరు తో త‌మ వంత కృషి చేస్తున్నారు. తాజాగా వీరి లిస్ట్ లో క‌రీనా క‌పూర్ చేరుతున్నారు. త‌న ఫ్రెండ్ అతిధి క‌పూర్ రాసి డైరెక్ట్ చేసిన ఒక డాక్యుమెంట‌రి ఫిల్మ్ ను క‌రీనా క‌పూర్ ప్రొడ్యూస్ చేస్తున్నార‌ట‌. ఆడ పిల్ల‌ల‌కు ఎడ్యుకేష‌న్ ఎంత క‌ష్టంగా అంతుంది.. ఆడ పిల్ల‌ల పాలిటి ప్ర‌త్య‌క్షంగానో..ప‌రోక్షంగా జ‌రుగుతున్న అస‌మాన‌త కాన్సెప్ట్ ను ఈ డాక్య్ మెంట‌రిలో చూపించార‌ట‌. ఇటువంటి మంచి ప‌నులు చేస్తే.. ఎవ‌రైనా అభిమానుల‌కు మ‌రింత చేరువ అవుతార‌న‌డంలో సందేహామే లేదు క‌దా…!.

First Published:  16 Sept 2015 10:30 PM GMT
Next Story