Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి ఎంట్రీతో సినిమా పూర్తి

రామ్ చరణ్ చేస్తున్న బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి నటించబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ఈ నెలాఖరు నుంచి పాల్గొంటారు చిరంజీవి. మెగాస్టార్ పై ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఈ షూటింగ్ పార్ట్ తో మొత్తం సినిమాకు సంబంధించి గుమ్మడి కాయ కొట్టాలని భావిస్తోంది యూనిట్. ప్రస్తుతం చిరంజీవిపై చేయాల్సిన పాటకు సంబంధించి హైదరాబాద్ లో భారీ సెట్ రెడీ అవుతోంది. మరోవైపు తమన్ కంపోజ్ చేసిన […]

చిరంజీవి ఎంట్రీతో సినిమా పూర్తి
X
రామ్ చరణ్ చేస్తున్న బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి నటించబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ఈ నెలాఖరు నుంచి పాల్గొంటారు చిరంజీవి. మెగాస్టార్ పై ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఈ షూటింగ్ పార్ట్ తో మొత్తం సినిమాకు సంబంధించి గుమ్మడి కాయ కొట్టాలని భావిస్తోంది యూనిట్. ప్రస్తుతం చిరంజీవిపై చేయాల్సిన పాటకు సంబంధించి హైదరాబాద్ లో భారీ సెట్ రెడీ అవుతోంది. మరోవైపు తమన్ కంపోజ్ చేసిన పాటలకు సరికొత్త స్టెప్పులు తయారుచేస్తున్నాడు డాన్స్ మాస్టర్ లారెన్స్. ఈ పాటతో బ్రూస్ లీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియో ఫంక్షన్ తేదీని ఎనౌన్స్ చేస్తారు. దసరా కనుకగా బ్రూస్ లీని థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనువైట్ల దర్శకుడు. ఇదే సినిమాలో ఇలియాన ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది.
First Published:  17 Sep 2015 12:30 AM GMT
Next Story