Telugu Global
Cinema & Entertainment

మొగిలి రేకుల   హీరో  సినిమా  ప్రొగ్రెస్ ఏంటో...!

మొగిలి రేకులు.  తెలుగు నాట న్యూస్ చానెల్స్ కు  8.30 స్లాట్ ను  ఎలా  భ‌ర్తి చేయాలా  అని త‌ల‌లు ప‌ట్టుకునేలా చేసిన  సూప‌ర్ డూప‌ర్ డైలీ  మెగా సీరియ‌ల్.  ముంజుల నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన ఈ సీరియ‌ల్ దాదాపు  4 సంవ‌త్స‌రాల పాటు  బుల్లి తెర బ్లాక్ బ‌స్ట‌ర్ గా  ఏలింది.  ఈ సీరియ‌ల్  హీరో  గా చేసిన ఆర్ కే నాయుడు అంటే  తెలియ‌ని  టీవి అభిమాని  వుండ‌టండే అతిశ‌యోక్తి కాదు. అయితే అదంత […]

మొగిలి రేకుల   హీరో  సినిమా  ప్రొగ్రెస్ ఏంటో...!
X

మొగిలి రేకులు. తెలుగు నాట న్యూస్ చానెల్స్ కు 8.30 స్లాట్ ను ఎలా భ‌ర్తి చేయాలా అని త‌ల‌లు ప‌ట్టుకునేలా చేసిన సూప‌ర్ డూప‌ర్ డైలీ మెగా సీరియ‌ల్. ముంజుల నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన ఈ సీరియ‌ల్ దాదాపు 4 సంవ‌త్స‌రాల పాటు బుల్లి తెర బ్లాక్ బ‌స్ట‌ర్ గా ఏలింది. ఈ సీరియ‌ల్ హీరో గా చేసిన ఆర్ కే నాయుడు అంటే తెలియ‌ని టీవి అభిమాని వుండ‌టండే అతిశ‌యోక్తి కాదు. అయితే అదంత గ‌తం.,

మ‌రి ఆ సీరియ‌ల్ తో వచ్చిన పాపులార్టీ ని కాపాడుకునే ప్ర‌య‌త్నంతో ఆరె కె నాయుడు వెండి తెర ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాడు. ఆ సీరియ‌ల్ కంప్లీట్ అయిన వెంట‌నే.. ఏదో ఒక చిత్రం ఎనౌన్స్ చేశారు. రాసి, రాజేంద్ర ప్ర‌సాద్ కీ రోల్స్ గా ఆర్ కే నాయుడు హీరోగా కొబ్బ‌రికాయ కూడా కొట్టారు. కానీ. ఎవో కార‌ణాల రీత్య ఆ చిత్రం పూర్తి కాలేదు. అయితే తాజ‌గా సిద్దార్ధ పేరు తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ను ద‌యానంద్ రెడ్డి అనే ద‌ర్శ‌కుడు చేస్తున్నారు. దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు . మొద‌టి షెడ్యూల్ మ‌లెసియాలో పూర్తి చేశారు. సెకండ్ షెడ్యూల్ హైద‌రా బాద్ లో ప్లాన్ చేస్తున్నారు . మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. అనంత‌శ్రీ‌రామ్ సాహిత్యం . మొత్తం మీద సిద్ధార్ధ చిత్రంతో ఆరె కే నాయుడు హీరోగా రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది మ‌రి.

First Published:  15 Sep 2015 8:45 PM GMT
Next Story