Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య లుక్ అదిరిపోవాలంతే..! 

లెజెండ్ త‌రువాత   బాలయ్య నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’ సినిమా చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య గత సినిమాలకు భిన్నంగా మోస్ట్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ కోసం బాలయ్యను ప్రత్యేకంగా మేకోవర్ చేసారు. ఇందుకోసం ఈరోస్ సంస్థ ఇండియాలోనే టాప్ స్టైలిస్ట్స్, డిజైనర్లను ప్రత్యేకంగా పిలిపించారట‌. డైరెక్టర్ శ్రీ‌వాస్..   అభిమానుల్ని ఇంప్రెస్ […]

బాల‌య్య లుక్ అదిరిపోవాలంతే..! 
X

లెజెండ్ త‌రువాత బాలయ్య నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’ సినిమా చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య గత సినిమాలకు భిన్నంగా మోస్ట్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ కోసం బాలయ్యను ప్రత్యేకంగా మేకోవర్ చేసారు. ఇందుకోసం ఈరోస్ సంస్థ ఇండియాలోనే టాప్ స్టైలిస్ట్స్, డిజైనర్లను ప్రత్యేకంగా పిలిపించారట‌.

డైరెక్టర్ శ్రీ‌వాస్.. అభిమానుల్ని ఇంప్రెస్ చేయ‌డానికి ఆల్మోస్ట్ వ‌ర్కువుట్ చేస్తున్నార‌ట‌. లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత‌.. ల‌య‌న్ వంటి డిజాస్ట‌ర్ ప‌డింది. దీంతో ఫెయిల్యూర్స్ ఎఫెక్ట్ ను మించి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌డానికి డిక్టేటర్ ద‌ర్శ‌కుడు వాస్ హార్డ్ వుర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి హీరోయిన్ గా న‌టిస్తుంది. వినాయ‌క చ‌తుర్ధి సంద‌ర్భంగా బాల‌య్య ఫ‌స్ట్ లుక్ అద‌ర‌హో అనిపించే రీతిలో చేస్తున్నారు. మ‌రి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  16 Sep 2015 8:00 AM GMT
Next Story