Telugu Global
CRIME

ఎస్‌.ఐ. అనుమానాస్పద మృతి?

రంగారెడ్డి జిల్లాలోని యాలాల ఎస్సై రమేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పెద్దేముల్ మండలం కందనెల్లి శివారులో చింతచెట్టుకు ఉరి వేసుకున్నట్టు ఎస్సై మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. రమేశ్ స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి తండా. రమేష్‌కు ఏడు నెలల క్రితమే వివాహమైనట్లు సమాచారం. ఆయన భార్య ఇపుడు నాలుగు నెలల గర్భవతి […]

ఎస్‌.ఐ. అనుమానాస్పద మృతి?
X
రంగారెడ్డి జిల్లాలోని యాలాల ఎస్సై రమేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పెద్దేముల్ మండలం కందనెల్లి శివారులో చింతచెట్టుకు ఉరి వేసుకున్నట్టు ఎస్సై మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. రమేశ్ స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి తండా. రమేష్‌కు ఏడు నెలల క్రితమే వివాహమైనట్లు సమాచారం. ఆయన భార్య ఇపుడు నాలుగు నెలల గర్భవతి అని చెబుతున్నారు.
మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు
ఎస్‌ఐ రమేష్‌ ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రమేష్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి కుటుంబసభ్యులు చెప్పారు. ఎస్‌ఐ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డిని మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కాగా ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ మృతదేహాన్ని తాండూరు ఏరియా ఆసుపత్రిలో ఉంచారు. గతంలో పెద్దేముల్‌ ఎస్‌ఐగా పనిచేసిన రమేష్‌ ఏడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. మృతిపై విచారణ జరిపించాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండు చేశారు. మంగళవారం భార్యతో కలిసి మార్కెట్‌కు వెళ్లిన ఎస్‌ఐ రమేష్‌ సెల్‌కు పలు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని తేలింది. ఫోన్‌లో ఎస్‌ఐ ఎవరితోనో కోపంగా మాట్లాడడం భార్య గమనించింది. ఆ వెంటనే ఓ పోలీసు అధికారి నుంచి కూడా ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ ఫోన్‌కాల్‌ వచ్చిన అరగంట తర్వాత డ్యూటీకి వెళుతున్నానంటూ ఎస్‌ఐ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంక తిరిగి రాలేదు. భార్యకు సారీ అంటూ మెసేజ్‌ పంపి తర్వాత ఓ కానిస్టేబుల్‌కు తాను ఉన్న ప్రదేశాన్ని సూచిస్తూ ఎస్‌ఎంఎస్‌ చేశారు.
First Published:  16 Sept 2015 2:06 AM GMT
Next Story