Telugu Global
Others

ర్యాగింగ్‌పై ఉస్మానియాలో అవగాహన సదస్సు

ర్యాగింగ్‌ను అరికట్టేందుకు విద్యార్థులే ముందుకు రావాలని, దీన్ని సామాజిక నిషేధంగా పరిగణిస్తే తప్ప పూర్తిగా అదుపు చేయలేమని డీసీపీ రవీందర్‌ అన్నారు. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న డీసీపీ రవీందర్ మాట్లాడుతూ…  ర్యాగింగ్ చట్టాలు కఠినతరంగా ఉన్నాయని, వాటిని అమలు చేసే పరిస్థితి వస్తే విద్యార్థుల జీవితాలు నాశనమై పోతాయని అన్నారు. అందుచేత విద్యార్థులే ర్యాగింగ్‌ నిరోధానికి సహకరించి ప్రయత్నిస్తే రూపుమాపడం పెద్ద […]

ర్యాగింగ్‌ను అరికట్టేందుకు విద్యార్థులే ముందుకు రావాలని, దీన్ని సామాజిక నిషేధంగా పరిగణిస్తే తప్ప పూర్తిగా అదుపు చేయలేమని డీసీపీ రవీందర్‌ అన్నారు. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న డీసీపీ రవీందర్ మాట్లాడుతూ… ర్యాగింగ్ చట్టాలు కఠినతరంగా ఉన్నాయని, వాటిని అమలు చేసే పరిస్థితి వస్తే విద్యార్థుల జీవితాలు నాశనమై పోతాయని అన్నారు. అందుచేత విద్యార్థులే ర్యాగింగ్‌ నిరోధానికి సహకరించి ప్రయత్నిస్తే రూపుమాపడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు.
First Published:  15 Sep 2015 1:16 PM GMT
Next Story