Telugu Global
Cinema & Entertainment

కంచెకు అతిథి చరణ్ మాత్రమే

వైజాగ్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన కంచె ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ హాజరవుతారని అంతా ఊహించారు. కానీ పవన్ మాత్రం కంచె ఆడియో ఫంక్షన్ కు రావట్లేదు. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఈ ఆడియో ఫంక్షన్ కు రావడానికి పవన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంచె ఆడియో ఫంక్షన్ కు రామ్ చరణ్ తేజ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ […]

కంచెకు అతిథి చరణ్ మాత్రమే
X
వైజాగ్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన కంచె ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ హాజరవుతారని అంతా ఊహించారు. కానీ పవన్ మాత్రం కంచె ఆడియో ఫంక్షన్ కు రావట్లేదు. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఈ ఆడియో ఫంక్షన్ కు రావడానికి పవన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంచె ఆడియో ఫంక్షన్ కు రామ్ చరణ్ తేజ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ కన్ ఫర్మ్ చేశారు. రేపు జరగనున్న ఈ ఆడియో ఫంక్షన్ కు చెర్రీ ప్రత్యేక అతిథిగా హాజరువుతాడు. తొలి సీడియని తన చేతుల మీదుగా ఆవిష్కరిస్తాడు. క్రిష్ దర్శకత్వంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ నటించిన ఈ సినిమాకు చిరంటన్ భట్ సంగీతం అందించాడు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఎలాగైనా తొలి విజయాన్ని నమోదుచేయాలని భావిస్తున్నాడు వరుణ్ తేజ.
First Published:  15 Sep 2015 7:00 PM GMT
Next Story