Telugu Global
Cinema & Entertainment

కొరటాల-క్రిష్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తాడు..

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. లండన్ లో ఈ సినిమా షూటింగ్ శరవేరంగా జరుగుతోంది. మరో నెల రోజుల్లో దాదాపు 90శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమా మొదలెట్టాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే తారక్ కోసం చాలామంది దర్శకులు కథలు సిద్ధంచేసి పెట్టుకున్నప్పటికీ ముఖ్యంగా ఇద్దరు దర్శకుల్ని పరిగణనలోకి తీసుకున్నాడు యంగ్ టైగర్. వాళ్లే క్రిష్, కొరటాల శివ. శ్రీమంతుడు సక్సెస్ తర్వాత కొరటాలతో […]

కొరటాల-క్రిష్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తాడు..
X
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. లండన్ లో ఈ సినిమా షూటింగ్ శరవేరంగా జరుగుతోంది. మరో నెల రోజుల్లో దాదాపు 90శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమా మొదలెట్టాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే తారక్ కోసం చాలామంది దర్శకులు కథలు సిద్ధంచేసి పెట్టుకున్నప్పటికీ ముఖ్యంగా ఇద్దరు దర్శకుల్ని పరిగణనలోకి తీసుకున్నాడు యంగ్ టైగర్. వాళ్లే క్రిష్, కొరటాల శివ. శ్రీమంతుడు సక్సెస్ తర్వాత కొరటాలతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు ఎన్టీఆర్. వీళ్లిద్దరి కాంబినేషన్ ను సెట్ చేసేందుకు మైత్రీ మూవీస్ సంస్థ తెరవెనక బాగానే ప్రయత్నిస్తోంది. మరోవైపు క్రిష్ కూడా తారక్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మైండ్ బ్లాంక్ అయ్యే కథతో ఎన్టీఆర్ ను మెస్మరైజ్ చేశాడు క్రిష్. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం వచ్చేనెలాఖరుకు తేలిపోతుంది. ఆ వెంటనే.. డిసెంబర్ నుంచి కొత్త సినిమా షూటింగ్ కూడా ప్రారంభమౌతుంది.
First Published:  15 Sep 2015 8:05 PM GMT
Next Story