Telugu Global
Cinema & Entertainment

ఎక్స్‌ప్రెస్‌ రాజా?

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తీసిన దర్శకుడు మేర్లపాక గాంధీ, రన్‌ రాజా రన్‌తో సూపర్‌హిట్‌ అందుకున్న శర్వానంద్‌ ఇప్పుడు ఇద్దరూ జత కలిశారు. మిర్చి, రన్‌ రాజా రన్‌, తాజాగా భలేభలే మగాడివోయ్‌ చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ కాంబినేషన్‌లో చిత్రం నిర్మిస్తోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్‌ పూర్తికావచ్చింది. గాంధీ స్టైల్‌లో ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ఏం పేరు పెడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వెంకటాద్రి సినిమాలోని ఎక్స్‌ప్రెస్‌, రన్‌ రాజా రన్‌లోని […]

ఎక్స్‌ప్రెస్‌ రాజా?
X

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తీసిన దర్శకుడు మేర్లపాక గాంధీ, రన్‌ రాజా రన్‌తో సూపర్‌హిట్‌ అందుకున్న శర్వానంద్‌ ఇప్పుడు ఇద్దరూ జత కలిశారు. మిర్చి, రన్‌ రాజా రన్‌, తాజాగా భలేభలే మగాడివోయ్‌ చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ కాంబినేషన్‌లో చిత్రం నిర్మిస్తోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్‌ పూర్తికావచ్చింది.
గాంధీ స్టైల్‌లో ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ఏం పేరు పెడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వెంకటాద్రి సినిమాలోని ఎక్స్‌ప్రెస్‌, రన్‌ రాజా రన్‌లోని రాజా రెండూకలిపి ఎక్స్‌ప్రెస్‌ రాజా అని పేరు పెడతామనుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ టైటిల్‌ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

First Published:  15 Sep 2015 8:10 PM GMT
Next Story