Telugu Global
Cinema & Entertainment

బన్నీ కొడుకు కూడా వచ్చేస్తున్నాడు..

ఒకప్పట్లా వారసుల్ని వెండితెరకు పరిచయం చేయడానికి పెద్దగా ఆలోచించడం లేదు ఈతరం హీరోలు. అవకాశం దొరికినప్పుడుల్లా తమ వారసుల్ని కెమెరా ముందు ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. మహేష్ బాబు ఇప్పటికే తన కొడుకు గౌతమ్ కృష్ణను వెండితెరకు పరిచయం చేశాడు. వన్-నేనొక్కడినే సినిమాతో గౌతమ్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బన్నీ కొడుకు అయాన్ కూడా కెమెరా ముందుకొస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు అల్లుఅర్జున్. ఈ సినిమాలో ఏడాదిన్నర బాబు పాత్ర […]

బన్నీ కొడుకు కూడా వచ్చేస్తున్నాడు..
X
ఒకప్పట్లా వారసుల్ని వెండితెరకు పరిచయం చేయడానికి పెద్దగా ఆలోచించడం లేదు ఈతరం హీరోలు. అవకాశం దొరికినప్పుడుల్లా తమ వారసుల్ని కెమెరా ముందు ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. మహేష్ బాబు ఇప్పటికే తన కొడుకు గౌతమ్ కృష్ణను వెండితెరకు పరిచయం చేశాడు. వన్-నేనొక్కడినే సినిమాతో గౌతమ్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బన్నీ కొడుకు అయాన్ కూడా కెమెరా ముందుకొస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు అల్లుఅర్జున్. ఈ సినిమాలో ఏడాదిన్నర బాబు పాత్ర ఒకటి ఉంది. ఈ పాత్ర కోసం బన్నీ కొడుకు అయాన్ ను తీసుకుందామని భావిస్తున్నాడు దర్శకుడు. ఇలా చేస్తే సినిమాకు మరింత మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నాడు. అయాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. ఏడాదిన్నర వయసున్న ఈ బుడ్డోడు ఇప్పటికే తన అందచందాలతో బాగా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు సినిమాలో కూడా అయాన్ ను చూపించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాడు..
Next Story