Telugu Global
Others

బెంగాల్‌లో విద్యార్థినిపై యాసిడ్‌ దాడి

తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ యువకుడు తన వెంట తెచ్చుకున్న యాసిడ్ యువతి మొహంపై పోశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది, స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని అలీపుర్దర్ లో జరిగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు అభి షా (25)ను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఎ.రవీంద్రనాథన్ చెప్పారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా నిరుద్యోగి […]

తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ యువకుడు తన వెంట తెచ్చుకున్న యాసిడ్ యువతి మొహంపై పోశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది, స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని అలీపుర్దర్ లో జరిగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు అభి షా (25)ను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఎ.రవీంద్రనాథన్ చెప్పారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా నిరుద్యోగి అభి షా కాలేజీ విద్యార్థిని వెంట పడుతూ తరచు వేధించేవాడని ఆయన చెప్పారు. ఆమె అభిషా ప్రేమను నిరాకరించడంతో తట్టుకోలేక నిందితుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడని, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
First Published:  15 Sep 2015 1:15 PM GMT
Next Story