Telugu Global
Cinema & Entertainment

రాణిరుద్ర‌మ లో రానా కొత్త లుక్  విడుద‌ల‌

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ స్వియ ద‌ర్శ‌క నిర్మాణంలో  ..కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో కీలక పాత్రలో దగ్గుపాటి రానా నటిస్తున్నారు. చాళుక్య వీరభధ్ర గా ఆయన కనిపించనున్నారు. అక్టోబర్ 9న విడుదల అవుతున్న ఈ చిత్రం కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఇందులో రానా మేచో లుక్ తో కనిపించనున్నారు. ఈ పోస్టర్ ని మీరూ ఇక్కడ చూడండి. […]

రాణిరుద్ర‌మ లో రానా కొత్త లుక్  విడుద‌ల‌
X

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ స్వియ ద‌ర్శ‌క నిర్మాణంలో ..కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో కీలక పాత్రలో దగ్గుపాటి రానా నటిస్తున్నారు. చాళుక్య వీరభధ్ర గా ఆయన కనిపించనున్నారు. అక్టోబర్ 9న విడుదల అవుతున్న ఈ చిత్రం కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఇందులో రానా మేచో లుక్ తో కనిపించనున్నారు. ఈ పోస్టర్ ని మీరూ ఇక్కడ చూడండి. ఈ హిస్టారికల్ మూవీ హిందీ రైట్స్ ని రిలియన్స్ కు చెందిన అబిషేక్ పిక్చర్స్ వారు 22 కోట్లకు సొంతం చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ కింగ్ గా పేరొందిన దిల్ రాజు నైజాం మాత్రమే కాకుండా మిగతా ఏరియాలలో కొన్ని తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇంతకుముందు పటాస్, బాహుబలి చిత్రాల విజయాలు అంచనా వేసి తీసుకుని లాభాలు గడించిన దిల్ రాజు ఈ చిత్రం పంపిణీ హక్కులు పోటీపడి తీసుకోవటంతో బిజినెస్ ఒక్కసారిగా వేడిక్కిందిఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న దిల్ రాజు ..రీసెంట్ గా చిత్రం ఫైనల్ కట్ చూసి ఇంప్రెస్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మ‌రి తెలుగు వారికి తెలిసిన చ‌రిత్ర కావ‌డంతో.. క‌థ ప‌రంగా అభిమానులు బాగా క‌నెక్ట్ అవుతార‌ని ఆశిస్తున్నారు చిత్ర యూనిట్. బాహుబ‌లి త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌డంత‌.. హిస్టారిక‌ల్ ఫిల్మ్ కావ‌డంతో..విజువ‌ల్స్ ప‌రంగా న‌య‌నానందక‌రంగా ఉంటాయ‌ని ఆశిస్తున్నారు అభిమానులు మ‌రి.

First Published:  15 Sep 2015 1:59 AM GMT
Next Story