Telugu Global
Cinema & Entertainment

కంచె ఆడియో ఫంక్షన్ కు పవన్?

నాగబాబు తనయుడు వరుణ్ తేజ హీరోగా నటించిన సినిమా కంచె. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను విశాఖలో ఏర్పాటుచేయాలని ఫిక్స్ అయ్యారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఆడియో ఫంక్షన్ కు ఇంకా 2 రోజులు మాత్రం మిగిలి ఉందనుకుంటున్న ఈ సమయంలో హఠాత్తుగా వేదికను మార్చేశారు మేకర్స్. అవును.. కంచె పాటల వేడుక విశాఖలో కాకండా హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈనెల 17న అంటే ఎల్లుండి విడుదల చేయబోతున్న ఈ పాటలకు సంబంధించి […]

కంచె ఆడియో ఫంక్షన్ కు పవన్?
X
నాగబాబు తనయుడు వరుణ్ తేజ హీరోగా నటించిన సినిమా కంచె. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను విశాఖలో ఏర్పాటుచేయాలని ఫిక్స్ అయ్యారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఆడియో ఫంక్షన్ కు ఇంకా 2 రోజులు మాత్రం మిగిలి ఉందనుకుంటున్న ఈ సమయంలో హఠాత్తుగా వేదికను మార్చేశారు మేకర్స్. అవును.. కంచె పాటల వేడుక విశాఖలో కాకండా హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈనెల 17న అంటే ఎల్లుండి విడుదల చేయబోతున్న ఈ పాటలకు సంబంధించి హైదరాబాద్ లోనే ఏదో ఒక వేదికను ఖరారు చేయబోతున్నారు. చిరంజీవి జోక్యంతోనే ఇలా వేదిక మారిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ ఆడియో ఫంక్షన్ కోసం చిరంజీవి, బన్నీ, రామ్ చరణ్ తో పాటు పవన్ కల్యాణ్ ను కూడా పిలవాలని భావిస్తున్నారు నాగబాబు. అయితే వేదిక విశాఖలో ఉంటే చాలామందికి అసౌకర్యంగా ఉంటుందని భావించి, లాస్ట్ మినిట్ లో మార్చేశారు. సో… కంచె ఆడియో ఫంక్షన్ ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతుంది కాబట్టి ఈ వేడుకకు ఎంతమంది మెగా హీరోలు వస్తారో చూడాలి.
Next Story