Telugu Global
Health & Life Style

వ్యాధి నిర్థార‌ణ‌

కీళ్లు క‌ద‌ల‌క‌పోతే…ఆర్థ‌రైటిస్ ఉన్న‌ట్లేనా! కీళ్ల నొప్పులు , క‌దిలించిన‌ప్పుడు ట‌క‌ట‌క ఎముక‌లు విరిగిన‌ట్లు శ‌బ్దం రావ‌డం లేదా కిర్రుమ‌ని ఒరిపిడి, ఎముక‌ల‌లో వాపు, కీళ్ల ద‌గ్గ‌ర నీరు చేర‌డం, కీళ్లు క‌దిలిక‌లు క‌ష్టంగా ఉండ‌డం, కీళ్ల ద‌గ్గ‌ర కండ‌రం ‌స‌న్న‌బ‌డిపోవ‌డం, కీళ్లు బ‌లంగా లేక బ‌రువు మోప‌డానికి ధైర్యం చాల‌క‌పోవ‌డం వంటివ‌న్నీ కీళ్ల స‌మ‌స్య‌ల ల‌క్ష‌ణాలే. అయితే ఇవ‌న్నీ ఆర్థ‌రైటిస్ ల‌క్ష‌ణాలు కాక‌పోవ‌చ్చు. అయితే ఈ ల‌క్ష‌ణాలలో కొన్ని క‌నిపించినా స‌రే వైద్యుని సంప్ర‌దించి త‌గిన ప‌రీక్ష‌లు […]

వ్యాధి నిర్థార‌ణ‌
X

కీళ్లు క‌ద‌ల‌క‌పోతే…ఆర్థ‌రైటిస్ ఉన్న‌ట్లేనా!

  • కీళ్ల నొప్పులు , క‌దిలించిన‌ప్పుడు ట‌క‌ట‌క ఎముక‌లు విరిగిన‌ట్లు శ‌బ్దం రావ‌డం లేదా కిర్రుమ‌ని ఒరిపిడి, ఎముక‌ల‌లో వాపు, కీళ్ల ద‌గ్గ‌ర నీరు చేర‌డం, కీళ్లు క‌దిలిక‌లు క‌ష్టంగా ఉండ‌డం, కీళ్ల ద‌గ్గ‌ర కండ‌రం ‌స‌న్న‌బ‌డిపోవ‌డం, కీళ్లు బ‌లంగా లేక బ‌రువు మోప‌డానికి ధైర్యం చాల‌క‌పోవ‌డం వంటివ‌న్నీ కీళ్ల స‌మ‌స్య‌ల ల‌క్ష‌ణాలే. అయితే ఇవ‌న్నీ ఆర్థ‌రైటిస్ ల‌క్ష‌ణాలు కాక‌పోవ‌చ్చు. అయితే ఈ ల‌క్ష‌ణాలలో కొన్ని క‌నిపించినా స‌రే వైద్యుని సంప్ర‌దించి త‌గిన ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందే.

ఆస్టిమో ఆర్థ‌రైటిస్‌ను నిర్థారించ‌డానికి…

ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కాన్ వంటి ప‌రీక్ష‌లు చేయాల్సి ఉంటుంది.
ఎక్స్‌రే ద్వారా ఎముక ములుకులా ఏర్ప‌డ‌డం, రెండు ఎముక‌ల మ‌ధ్య ఖాళీ త‌గినంత లేక ఎముక‌లు ద‌గ్గ‌ర‌గా జ‌ర‌గ‌డం, కీళ్ల‌లో క్యాల్షియం నిక్షిప్త‌మై ఉండ‌డం వంటి ప్రాథ‌మిక అంశాలు తెలుస్తాయి.
ఎంఆర్ఐ స్కాన్ (మ్యాగ్న‌టిక్ రిజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్‌) ద్వారా ఎముక‌ల మ‌ధ్య ఉండే కార్టిలేజ్, కండ‌రాలు, ఎముక‌ను కండరాన్ని క‌లిపే టెండాన్స్ ప‌రిస్థితితోపాటు ఎముక‌లో వ‌చ్చిన చిన్న పాటి తేడాల‌ను కూడా క్షుణ్నంగా తెలుసుకోవ‌చ్చు.
సాధార‌ణంగా ఏ ర‌క‌మైన అనారోగ్య‌మైనా స‌రే డాక్ట‌ర్లు మొద‌ట ర‌క్త‌ప‌రీక్ష‌ను సూచిస్తుంటారు. కానీ ఇందులో ర‌క్త‌ప‌రీక్ష చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఆస్టియో ఆర్థ‌రైటిస‌స్‌తోపాటు ర‌క్త‌హీన‌త వంటి ఇత‌ర అనారోగ్య ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు సందేహించిన‌ప్పుడు మాత్రం ఆ ప‌రీక్షను కూడా సూచిస్తారు.

First Published:  14 Sep 2015 7:02 PM GMT
Next Story