Telugu Global
Cinema & Entertainment

చైనాలో 5000 స్క్రీన్స్ లో బాహుబలి భారీ రిలీజ్

క‌ల‌య .. నిజ‌మా   అన్నంత‌గా  రికార్డులు సృష్టించిన  మ‌న   బాహుబ‌లి..   మ‌రో రికార్డుకు సిద్దం అయ్యింది. ఈ మ‌ధ్య  మ‌న ఇండియ‌న్ ఫిల్మ్స్ కు   చైనా లో కూడా మార్కెట్ పెరుగుతున్న విష‌యం తెలిసిందే.  ఆ మ‌ధ్య  అమీర్ ఖాన్, అనుష్క శ‌ర్మ  లీడ్ రోల్స్ లో వ‌చ్చిన  పీకే చిత్రం  చైనా లో  రిలీజై  మంచి వ‌సూలు రాబ‌ట్టింది.   క‌ట్ చేస్తే..  ఎస్ ఎస్ రాజ‌మౌళి , ప్ర‌భాస్, […]

చైనాలో 5000 స్క్రీన్స్ లో బాహుబలి భారీ రిలీజ్
X
క‌ల‌య .. నిజ‌మా అన్నంత‌గా రికార్డులు సృష్టించిన మ‌న బాహుబ‌లి.. మ‌రో రికార్డుకు సిద్దం అయ్యింది. ఈ మ‌ధ్య మ‌న ఇండియ‌న్ ఫిల్మ్స్ కు చైనా లో కూడా మార్కెట్ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఆ మ‌ధ్య అమీర్ ఖాన్, అనుష్క శ‌ర్మ లీడ్ రోల్స్ లో వ‌చ్చిన పీకే చిత్రం చైనా లో రిలీజై మంచి వ‌సూలు రాబ‌ట్టింది.
క‌ట్ చేస్తే.. ఎస్ ఎస్ రాజ‌మౌళి , ప్ర‌భాస్, రానా, అనుష్క , త‌మ‌న్న లతో చేసిన బాహుబ‌లి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై ఎన్నో రికార్డులు సృష్టించింది. హైయ‌స్ట్ గ్రాస్ క‌లెక్ష‌న్స్ ( దాదాపు 550 కోట్లు ..విడుద‌లైన అన్ని చోట్ల క‌లిపి) చేసింది. ఇక లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే..ఈ సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా న‌వంబ‌ర్ లో బాహుబ‌లిని చైనా లో భారీగా రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ణాళిక సిద్దం చేశార‌ట‌. దాదాపు 5 వేల స్క్రీన్స్ లో బాహుబ‌లిని రిలీజ్ చేయ‌డానికి వ‌ర్కువుట్ చేశార‌ని టాక్. వాస్త‌వంగా బాహుబ‌లిని అన్ని లాంగ్వేజెస్ లో క‌లిపి ప్ర‌పంచ వ్యాప్తంగా 4 వేల స్క్రీన్స్ లో మాత్ర‌మే రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. కానీ.. కేవ‌లం ఒక్క చైనా లో ఈ చిత్రాన్ని 5 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేయ‌బోయ‌డం అనేది మ‌రో రికార్డు గానే చెబుతున్నారు పరిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ ఫిల్మ్ కూడా చైనా లో 5 వేల స్క్రీన్స్ లో ప్ర‌ద‌ర్శించిన సంద‌ర్భం లేదు. ఇంతకి చైనాలో బాహుబ‌లి చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేగా మీ డౌట్..? న‌వంబ‌ర్ నెల‌లో అని స‌మాచారం.
Next Story