Telugu Global
Others

ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా టర్న్‌బుల్

ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా కమ్యూనికేషన్ శాఖ మంత్రి మాల్కం టర్న్‌బుల్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని టోనీ అబాట్‌పై సొంత పార్టీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టర్న్‌బుల్.. అంతర్గత ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో టర్న్‌బుల్‌కు 54, అబాట్‌కు 44 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రధాని పదవి నుంచి అబాట్ వైదొలగాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో ఆస్ర్టేలియా ప్రధానిగా టర్న్‌బుల్ ప్రమాణస్వీకారం చేశారు. మరో రెండేండ్లు అధికారంలో ఉండనున్న సంకీర్ణ కన్జర్వేటివ్ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తారు. […]

ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా కమ్యూనికేషన్ శాఖ మంత్రి మాల్కం టర్న్‌బుల్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని టోనీ అబాట్‌పై సొంత పార్టీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టర్న్‌బుల్.. అంతర్గత ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో టర్న్‌బుల్‌కు 54, అబాట్‌కు 44 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రధాని పదవి నుంచి అబాట్ వైదొలగాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో ఆస్ర్టేలియా ప్రధానిగా టర్న్‌బుల్ ప్రమాణస్వీకారం చేశారు. మరో రెండేండ్లు అధికారంలో ఉండనున్న సంకీర్ణ కన్జర్వేటివ్ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తారు. మాజీ బ్యాంకర్, మిలియనీర్, ఐటీ వ్యాపారవేత్త అయిన టర్న్‌బుల్ గత రెండేండ్లలో ఆస్ట్రేలియాకు నాలుగో ప్రధానిగా కొనసాగనున్నారు. టర్న్‌బుల్ ఆస్ట్రేలియాకు 29వ ప్రధాని.
First Published:  14 Sep 2015 1:07 PM GMT
Next Story