Telugu Global
Cinema & Entertainment

శ్రీదివ్యకు షాకిచ్చిన సమంత

సమంత లాంటి బిగ్ హీరోయిన్ తలుచుకుంటే.. శ్రీదివ్య లాంటి చిన్న హీరోయిన్లకు మూడినట్టే. ఒక్కసారి కనుక టార్గెట్ చేస్తే తను అనుకున్నది సాధించకుండా ఉండదు సమంత. ఆ పంతమే ఇప్పుడు శ్రీదివ్యకు శాపంగా మారింది. బంగారం లాంటి సినిమా ఛాన్స్ పోయేలా చేసింది. మరీ ముఖ్యంగా కొన్ని రోజులు షూటింగ్ చేసి మరీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బెంగుళూరు డేస్ అనే సినిమాకు సంబంధించిన తాజా వార్త ఇది. ఈ సినిమాలో లీడ్ రోల్ […]

శ్రీదివ్యకు షాకిచ్చిన సమంత
X
సమంత లాంటి బిగ్ హీరోయిన్ తలుచుకుంటే.. శ్రీదివ్య లాంటి చిన్న హీరోయిన్లకు మూడినట్టే. ఒక్కసారి కనుక టార్గెట్ చేస్తే తను అనుకున్నది సాధించకుండా ఉండదు సమంత. ఆ పంతమే ఇప్పుడు శ్రీదివ్యకు శాపంగా మారింది. బంగారం లాంటి సినిమా ఛాన్స్ పోయేలా చేసింది. మరీ ముఖ్యంగా కొన్ని రోజులు షూటింగ్ చేసి మరీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బెంగుళూరు డేస్ అనే సినిమాకు సంబంధించిన తాజా వార్త ఇది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసేందుకు మొదట సమంతానే సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్ తిరస్కరించింది. దీంతో శ్రీదివ్యతో షూటింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు 15 రోజుల షూటింగ్ కూడా నడిచింది. ఇంతలోనే సమంత మనసు మారింది. తనకు ఆ సినిమా చేస్తానంటూ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు ఫోన్ చేసింది. ఇంకేముంది.. సమంతలాంటి బిగ్ హీరోయిన్ ఒప్పుకున్న తర్వాత కూడా శ్రీదివ్యను కొనసాగిస్తారా.. 15 రోజుల షూటింగ్ తర్వాత శ్రీదివ్య ఇంటికెళ్లిపోయింది. సమంత రాకతో బెంగుళూర్ డేస్ సినిమా ఫ్రెష్ గా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.
Click Here For Sridivya Latest Stills
First Published:  13 Sep 2015 8:30 PM GMT
Next Story