Telugu Global
Cinema & Entertainment

'హీరో'కు సల్మాన్ ధ‌న్య‌వాదాలు!

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. స‌ల్మాన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి, పాట కూడా పాడిన చిత్రం హీరో. ఆదిత్య పంచోలి, అతియా శెట్టి జంట‌గా న‌టించిన ఈ చిత్రం తొలిరోజు రూ.6.5 కోట్లు వ‌సూలు చేసింది. తాను నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రానికి తొలిరోజు ప్రేక్ష‌కులు చూపిన అభిమానానికి పొంగిపోయాడు బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌. అందుకే వారికి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌కుండా ఉండ‌లేక‌పోయాడు. ట్విట్ట‌ర్‌లో శ‌నివారం ప్రేక్ష‌క దేవుళ్లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శుక్ర‌వారం ఈ చిత్రం […]

హీరోకు సల్మాన్ ధ‌న్య‌వాదాలు!
X
బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. స‌ల్మాన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి, పాట కూడా పాడిన చిత్రం హీరో. ఆదిత్య పంచోలి, అతియా శెట్టి జంట‌గా న‌టించిన ఈ చిత్రం తొలిరోజు రూ.6.5 కోట్లు వ‌సూలు చేసింది. తాను నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రానికి తొలిరోజు ప్రేక్ష‌కులు చూపిన అభిమానానికి పొంగిపోయాడు బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌. అందుకే వారికి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌కుండా ఉండ‌లేక‌పోయాడు. ట్విట్ట‌ర్‌లో శ‌నివారం ప్రేక్ష‌క దేవుళ్లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శుక్ర‌వారం ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. వ‌సూళ్ల‌ప‌రంగా ఫ‌ర‌వాలేద‌నిపించినా.. సినీ విమ‌ర్శ‌కులు మాత్రం సినిమాను ఉతికి ఆరేశారు. ‘హీరో ‘సినిమాను ‘జీరో’గా అభివ‌ర్ణించారు. 1980లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని పున‌ర్నిర్మించి పాడు చేశార‌ని విమ‌ర్శించారు.
Next Story