Telugu Global
Cinema & Entertainment

కబలి అర్ధం ఏంటంటే...

రంజిత్ దర్శకత్వంలో వినాయక చవితి నుంచి కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు రజనీకాంత్. ఈ సినిమాలో రాధికా ఆప్టేను హీరోయిన్ గా తీసుకున్నారు. జేడీ చక్రవర్తి, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ ఎలా కనిపిస్తాడనే ఆసక్తి మాత్రం అభిమానుల్లో చాలా ఉంది. ఎందుకంటే.. కొచ్చాడయాన్ సినిమాలో యుద్ధవీరుడిగా కనిపించాడు రజనీ. తర్వాతొచ్చిన లింగాలో మరో గెటప్ లో అదరగొట్టాడు. కాబట్టి రంజీత్ దర్శకత్వంలో వస్తున్న కబలి సినిమాలో రజనీ పాత్ర ఏంటనే […]

కబలి అర్ధం ఏంటంటే...
X
రంజిత్ దర్శకత్వంలో వినాయక చవితి నుంచి కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు రజనీకాంత్. ఈ సినిమాలో రాధికా ఆప్టేను హీరోయిన్ గా తీసుకున్నారు. జేడీ చక్రవర్తి, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ ఎలా కనిపిస్తాడనే ఆసక్తి మాత్రం అభిమానుల్లో చాలా ఉంది. ఎందుకంటే.. కొచ్చాడయాన్ సినిమాలో యుద్ధవీరుడిగా కనిపించాడు రజనీ. తర్వాతొచ్చిన లింగాలో మరో గెటప్ లో అదరగొట్టాడు. కాబట్టి రంజీత్ దర్శకత్వంలో వస్తున్న కబలి సినిమాలో రజనీ పాత్ర ఏంటనే విషయంపై అందర్లో ఆసక్తి నెలకొంది. సినిమా షూటింగ్ దగ్గర పడుతున్న టైమ్ లో, ఆ పాత్ర ఏంటనేది అందరికీ తెలిసింది. చెన్నైకి చెందిన మాఫియా డాన్ కబలీశ్వరన్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నాడని సమాచారం. అంటే.. కబలి సినిమాలో రజనీకాంత్ మాఫియా డాన్ గా నటిస్తాడన్నమాట. ఇలాంటి పాత్రను రజనీ ఇప్పటికే బాషా సినిమాలో చేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ కబలి సినిమాలో కబలీశ్వరన్ గా కనిపించనున్నాడు.
First Published:  12 Sep 2015 7:01 PM GMT
Next Story