Telugu Global
Others

విరాట్ కోహ్లీ, స‌చిన్ ట్వీట్ల యుద్ధం!

భార‌త క్రికెట్ జ‌ట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, క్రికెట్ గాడ్ స‌చిన్ కు మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా మాట‌ల యుద్ధం న‌డిచింది. అయితే.ఇదంతా స‌ర‌దాకి మాత్ర‌మే! విష‌య‌మేంటంటే.. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో యూఏఈ రాయల్స్‌ జట్టుకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సహా యజమానిగా ఉన్నాడు. రాయల్స్ జట్టుకు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ నేతృత్వం వహిస్తున్నాడు. విరాట్ జ‌ట్టులో త‌న‌కు ఆడాల‌ని ఉంద‌ని మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ […]

విరాట్ కోహ్లీ, స‌చిన్ ట్వీట్ల యుద్ధం!
X
భార‌త క్రికెట్ జ‌ట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, క్రికెట్ గాడ్ స‌చిన్ కు మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా మాట‌ల యుద్ధం న‌డిచింది. అయితే.ఇదంతా స‌ర‌దాకి మాత్ర‌మే! విష‌య‌మేంటంటే.. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో యూఏఈ రాయల్స్‌ జట్టుకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సహా యజమానిగా ఉన్నాడు. రాయల్స్ జట్టుకు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ నేతృత్వం వహిస్తున్నాడు. విరాట్ జ‌ట్టులో త‌న‌కు ఆడాల‌ని ఉంద‌ని మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ ట్వీట్ చేశాడు. దీనిపై విరాట్ వెంట‌నే స్పందించాడు. నీ వ‌ల్ల కాదేమో! అంటూ స‌చిన్‌ను ఉద్దేశించి స‌ర‌దాగా రీ ట్వీట్ చేశాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది వీరాభిమానుల‌ను క‌లిగిన స‌చిన్ రోజర్ ఫెదరర్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.! మొత్తానికి ట్వీట్‌ల యుద్ధం అభిమానుల‌ను కాసేపు గంద‌రగోళానికి గురిచేసిన‌ప్ప‌టికీ.. అంతా స‌ర‌దాకేన‌ని తెలుసుకుని న‌వ్వుకున్నారు.
First Published:  12 Sep 2015 11:43 PM GMT
Next Story