మరాఠీలో విద్యాబాలన్ ఉలాలా.. ఉలాలా..!
డర్టీ పిక్చర్ సినిమాతో దేశాన్ని ఒక ఊపుఊపిన విద్యాబాలన్ చూపు ఇప్పుడు మరాఠీ సినిమాపై పడింది. ప్రముఖ నటుడు-దర్శకుడు భగవాన్‌దాదా జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున మెరవనుంది ఈ మళయాళ ముద్దుగుమ్మ. భగవాన్ దాదా- మరాఠీ సుందరి గీతాబాలి కలయికలో 1951లో అల్బేలా చిత్రం విడుదలైంది. ఆ చిత్రం తెరకెక్కే సమయంలో భగవాన్ దాదా ఎదుర్కొన్న కష్టాలను సినిమాలో చూపించనున్నారు. అందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో విద్యాబాలన్ గీతా బాలి పాత్రలో కనువిందు […]
BY admin12 Sep 2015 8:03 PM GMT

X
admin12 Sep 2015 8:03 PM GMT
డర్టీ పిక్చర్ సినిమాతో దేశాన్ని ఒక ఊపుఊపిన విద్యాబాలన్ చూపు ఇప్పుడు మరాఠీ సినిమాపై పడింది. ప్రముఖ నటుడు-దర్శకుడు భగవాన్‌దాదా జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున మెరవనుంది ఈ మళయాళ ముద్దుగుమ్మ. భగవాన్ దాదా- మరాఠీ సుందరి గీతాబాలి కలయికలో 1951లో అల్బేలా చిత్రం విడుదలైంది. ఆ చిత్రం తెరకెక్కే సమయంలో భగవాన్ దాదా ఎదుర్కొన్న కష్టాలను సినిమాలో చూపించనున్నారు. అందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో విద్యాబాలన్ గీతా బాలి పాత్రలో కనువిందు చేయనున్నారు. గీతా బాలి పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మరాఠీయుల మనసు దోచుకున్న పాతతరం సుందరి గీతా బాలి పాత్రలో ఏ మేరకు అలరిస్తుందోనని విద్యాబాలన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Next Story