Telugu Global
Others

హిందూయిజం దేశ సంస్కృతికి గుర్తింపు: వెంకయ్య

హిందూయిజం దేశ సంస్కృతికి గుర్తింపులాంటిదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో ది క్రానాలజీ ఆఫ్ ఏన్సియంట్ ఇండియా పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి ఎంతో గొప్పదైన వారసత్వ సంపద ఉన్నదని అన్నారు. జాతి ముందుకెళ్లాలంటే వారసత్వ సంపద ఎంతో అవసరమని అన్నారు. కొంతమంది చరిత్రను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారన్నారు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవం రావాల్సిన అవసరం ఉందని.. చరిత్ర సాంకేతిక పరిజ్ఞానం కలిసినపుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

First Published:  12 Sep 2015 1:20 PM GMT
Next Story